AAP : స్వాతి మాలివాల్ పై దాడి..రోజుకో ట్విస్ట్‌ ..మరో వీడియో విడుదల

  • Written By:
  • Updated On - May 18, 2024 / 12:54 PM IST

Attack on Swati Maliwal: ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్‌ పై జరిగిన దాడి ఘటన తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. బెయిల్‌ మీద బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌(Delhi CM Kejriwal) ఇంటికెళ్లానని స్వాతి మాలివాల్‌ వివరించారు. అయితే ఆ సమయంలో కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభన్‌ కుమార్‌ తనపై దాడి చేశారని ఆమె కీలక ఆరోపణలు చేశారు. కుర్చీలో కూర్చొన్న తనపై బిభవ్ కుమార్ దాడి చేశారని, కాలితో తన్నారని ఆరోపించారు. ఆ తర్వాత బిభవ్ కుమార్‌పై పోలీసు స్టేషన్‌లో కేసు కూడా పెట్టారు. స్వాతి మాలివాల్ దాడి ఘటన ఆప్, బీజేపీ మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీసింది.

కాగా, బీజేపీ చేతిలో స్వాతి మాలివాల్ పావుగా మారారని, అందుకే తమపై నిరాధారంగా ఆరోపణలు చేస్తున్నారని ఆప్ ఖండించింది. ఆ రోజు ఏం జరిగిందో చెప్పేందుకు తాజాగా మరో వీడియోను ఆమ్‌ ఆద్మీ పార్టీ తాజాగా ఎక్స్‌లో పోస్టు చేసింది. కేజ్రీవాల్ ఇంటి బయట రికార్డైన ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఆ వీడియోలో కేజ్రీవాల్ నివాసం నుంచి బయటకు వస్తోన్న స్వాతి మాలివాల్ స్పష్టంగా కనిపించారు. బయటకు వచ్చే సమయంలో మహిళ సెక్యూరిటీ సిబ్బంది ఆమె చేయి పట్టుకొని కనిపించారు. మెయిన్ రోడ్డు మీదకు వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. తర్వాత కూడా ఓ పోలీస్ అధికారి రాగా.. అతనితో స్వాతి మాలివాల్ మాట్లాడారు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే ఆ ఫుటేజీలో స్వాతి మాలివాల్‌(Swati Maliwal)కు ఎలాంటి గాయాలు కనిపించలేదు. తనపై బిభవ్ దాడి చేశారని స్వాతి మాలివాల్ అంటున్నారు. వెంటనే బయటకు వస్తోన్న సమయంలో గాయాలు కనిపించడం లేదనే సందేహం కలుగుతుంది. స్వాతి మాలివాల్‌ను మహిళ అధికారి ఆపుతుండగా వదిలించుకుని వెళ్లినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సమయంలో ఎలాంటి గాయాలు లేవని.. తర్వాత గాయాలు ఎలా అయ్యాయని ఆప్ నేతలు ప్రశ్నిస్తున్నారు. స్వాతి మాలివాల్ వెనక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసు అని ఆప్ నేతలు విమర్శిస్తున్నారు.

Read Also: Allu Arjun Pushpa 2 : ఆ సినిమా కోసం మలేషియాని హైదరాబాద్ కి తెచ్చేశారు..!