Atishi Swearing LIVE: అతిషి అనే నేను

Atishi Swearing LIVE: అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రిగా రాజ్ నివాస్‌లో జరిగిన కార్యక్రమంలో అతిషి తన కొత్త మంత్రి మండలితో కలిసి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు

Published By: HashtagU Telugu Desk
Atishi Swearing LIVE

Atishi Swearing LIVE

Atishi Swearing LIVE: ఢిల్లీకి నూతన ముఖ్యమంత్రిగా అతిషి (atishi ) ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు.దీంతో ఆమె ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ ప్రమాణస్వీకార మహోత్సవానికి మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. కాగా ఈ వారం ప్రారంభంలో ఆప్ ఎమ్మెల్యేలు సమావేశమై అధికార శాసనసభా పక్ష నేతగా అతిషిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అరవింద్ కేజ్రీవాల్ (kejriwal) ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రిగా రాజ్ నివాస్‌లో జరిగిన కార్యక్రమంలో అతిషి తన కొత్త మంత్రి మండలితో కలిసి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ ప్రకటించిన కొత్త మంత్రి మండలిలో కొత్తగా చేరిన సుల్తాన్‌పూర్ మజ్రా ఎమ్మెల్యే ముఖేష్ అహ్లావత్‌తో పాటు మంత్రులు గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్ మరియు ఇమ్రాన్ హుస్సేన్ ఉన్నారు.

తన ఉద్వేగభరితమైన ప్రసంగంలో కేజ్రీవాల్ రాజీనామా నిర్ణయం చాలా బాధాకరమైన క్షణమని అతిషి పేర్కొన్నారు. తనకు తాత్కాలికంగా ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారని, అయితే తన పదవీకాలం వచ్చే ఎన్నికల వరకు మాత్రమే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అయినందుకు నన్ను అభినందించకండి లేదా పూలమాల వేయకండి. ఎన్నికల వరకు మాత్రమే ఈ పదవిలో ఉంటాను. మేము గెలిస్తే అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా తిరిగి వస్తాడు అని అతిషి అన్నారు.

దివంగత సుష్మా స్వరాజ్ , దివంగత షీలా దీక్షిత్ తర్వాత అతిషి దేశంలో 17వ మహిళా ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. కాగా ఐదుగురు మంత్రుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.

Also Read: Oyo USA : అమెరికాలో ‘ఓయో’ దూకుడు.. రూ.4,300 కోట్లతో భారీగా హోటళ్ల కొనుగోలు

  Last Updated: 21 Sep 2024, 05:28 PM IST