Atishi : మరో నలుగురు ఆప్‌ నేతలు అరెస్టు..అతిషి కీలక వ్యాఖ్యలు

  • Written By:
  • Publish Date - April 2, 2024 / 11:31 AM IST

Aam Aadmi Party: నేడు ఢిల్లీలో మీడియాతో ఆప్‌ మంత్రి ఆతిషి(AAP Minister Atishi) మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న రెండు నెల‌ల్లో, లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు మరో న‌లుగురు ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) నేత‌లు అరెస్టు కానున్న‌ట్లు ఆమె చెప్పారు. ఆ జాబితాతో త‌న‌తో పాటు సౌర‌భ్ భ‌ర‌ద్వాజ్‌, ఆతిషి, దుర్గేశ్ పాఠ‌క్‌, రాఘ‌వ్ చ‌ద్దాలు ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. కేంద్రంలోని బీజేపీ(bjp) పాల‌న ప‌ట్ల త‌మ‌కు భ‌యం లేద‌ని, ఎంత మందిని అరెస్టు చేసినా త‌మ పోరాటం ఆగ‌దు అని పేర్కొన్నారు. తాము కేజ్రీవాల్ సైనికుల‌మ‌ని ఆమె అన్నారు. త‌మ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంద‌ని, ఆప్ కార్య‌క‌ర్త‌ల‌ను బీజేపీ జైల్లో వేసినా, ప్ర‌తి కార్య‌క‌ర్త మ‌ళ్లీ పోరాటం చేస్తూనే ఉంటార‌న్నారు. ఒక్క‌ర్ని జైల్లో వేస్తే ప‌ది మంది పోరాడేందుకు పుట్టుకు వ‌స్తార‌ని ఆమె అన్నారు. ఒకవేళ బీజేపీలో చేరితే త‌న‌ను అరెస్టు చేయ‌బోర‌ని ఓ నేత చెప్పినట్లు మంత్రి ఆతిషి వెల్ల‌డించారు.

on WhatsApp. Click to Join.

మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు మరోసారి పొడగించింది. ఈనెల 15వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీని విధిస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కేజ్రీవాల్ ను అధికారులు తీహార్ జైలుకు తరలించనున్నారు. లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. తొలుత ఏడు రోజులు ఈడీ కస్టడీకి అనుమతిచ్చిన కోర్టు.. అనంతరం మరో నాలుగు రోజుల పాటు కస్టడీని పొడగించింది.

Read Also: New Rules: ఏప్రిల్ 1వ తేదీ నుంచి మారిన ఆర్థిక నిబంధ‌న‌లు ఇవే..!

అయితే జైలులో చదువుకోవడానికి పుస్తకాలు సమకూర్చాలని, ఇంట్లో చేసిన ఆహారానికి అనుమతించాలంటూ కేజ్రీవాల్ చేసిన అభ్యర్థనకు కోర్టు ఆమోదం తెలిపింది. భగవద్గీత, రామాయణం, ‘హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్’ ఈ మూడు పుస్తకాలను కేజ్రీవాల్‌కు అందించేందుకు కోర్టు అనుమతించింది. కేజ్రీవాల్ తన ఇంట్లో వండిన భోజనం, మందులు, ఇంట్లో వాడే పరుపులు, దిండ్లతో పాటు ఇతర నిత్యావసరాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు జైలులో ఆయనకు మతపరమైన లాకెట్‌ కేటాయింపునకు కూడా అనుమతిచ్చింది.