Site icon HashtagU Telugu

Atiq Posters: అతిక్ అహ్మద్ సోదరులు అమరవీరులుగా పోస్టర్లు కలకలం

Atiq Posters

Atiq Posters

Atiq Posters: నేరగాళ్లు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌లకు మద్దతుగా మహారాష్ట్రలో పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లలో సోదరులిద్దరూ అమరవీరులుగా పేర్కొన్నారు. అతీక్, అహ్మద్‌లను అమరవీరులుగా ప్రకటిస్తూ పోస్టర్లు కనిపించడం కలకలం రేగింది. అతిక్, అష్రఫ్ పోస్టర్లకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 293, 294, 153 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నేత ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.

అతిక్ మరియు అతని సోదరుడు అష్రఫ్‌కు మద్దతుగా మహారాష్ట్రలోని బీడ్‌లో పోస్టర్లు వెలిశాయి. మజల్‌గావ్‌లో వేసిన పోస్టర్లలో సోదరులిద్దరూ అమరవీరులని పేర్కొన్నారు. పోస్టర్లపై సమాచారం అందిన వెంటనే పోలీసులు వాటిని తొలగించారు. అతిక్, అష్రఫ్‌లకు మద్దతుగా పోస్టర్లు వెలిశాయని వార్తలు వెలువడిన వెంటనే నగరంలో కలకలం మొదలైంది. వీహెచ్‌పీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే పోస్టర్లను తొలగించారు.

ఉమేష్ పాల్ హత్య కేసులో అతిక్, అష్రఫ్‌లను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కాల్విన్ ఆసుపత్రికి వైద్య చికిత్స కోసం తీసుకువెళుతుండగా, దుండగులు కాల్పులు జరపడంతో సోదరులిద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఘటనా స్థలం నుంచి అరుణ్, సన్నీ, లవ్లేష్ తివారీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించారు.

Read More: Lakshminarayana : ప్ర‌జాశాంతి పార్టీలోకి లక్ష్మీనారాయ‌ణ ?