Atal Pension Yojana: ప్రతి నెలా మనీ సేవ్ చేయండి.. 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.5,000 పొందండిలా..!

ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత వారి సామాజిక-ఆర్థిక భద్రతపై శ్రద్ధ వహిస్తూ కేంద్ర ప్రభుత్వం దేశంలో అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana)ను అమలు చేస్తోంది.

  • Written By:
  • Publish Date - May 31, 2023 / 09:18 AM IST

Atal Pension Yojana: ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత వారి సామాజిక-ఆర్థిక భద్రతపై శ్రద్ధ వహిస్తూ కేంద్ర ప్రభుత్వం దేశంలో అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana)ను అమలు చేస్తోంది. దీనిలో మీరు నిర్దిష్ట వయస్సు తర్వాత నెలకు రూ. 5,000 వరకు పొందవచ్చు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం పట్ల ప్రజల ఆదరణ వేగంగా పెరుగుతోంది. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం.. మార్చి 2023లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS), NPS లైట్, అటల్ పెన్షన్ యోజన మొత్తం సభ్యుల సంఖ్య 624.81 లక్షలకు పెరిగింది

60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెలా పెన్షన్

అసంఘటిత రంగంలోని ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించడంతోపాటు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ. 5000 ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో 2015లో అటల్ పెన్షన్ యోజన (APY)ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

మీరు ప్రతి నెలా 42 రూపాయలు మాత్రమే పెట్టుబడి

అటల్ పెన్షన్ యోజనలో నిర్ణీత మొత్తాన్ని పొందడానికి మీరు 60 సంవత్సరాల వయస్సు వరకు ప్రతి నెలా కనీసం రూ. 42, గరిష్టంగా రూ. 1454 విరాళంగా ఇవ్వాలి. ప్రతి నెలా రూ.42 ఇన్వెస్ట్ చేస్తే 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.1,000 పెన్షన్ వస్తుంది. మరోవైపు ప్రతి నెలా రూ.1454 డిపాజిట్ చేస్తే 60 ఏళ్లు నిండిన తర్వాత రూ.5వేలు పింఛను అందుతుంది.

Also Read: Petrol Diesel Price Today: నేటి పెట్రోల్, డీజిల్ ధరలివే.. మీ ఫోన్ లో ఒక క్లిక్ తో రేట్స్ తెలుసుకోండిలా..!

అటల్ పెన్షన్ ఖాతాను ఇక్కడ తెరవండి

పథకం ప్రయోజనం పొందడానికి, దరఖాస్తుదారు వయస్సు 18 నుండి 40 సంవత్సరాలు ఉండాలి. మీరు మీ దగ్గరలోని బ్యాంకు లేదా పోస్టాఫీసులో పొదుపు ఖాతాను తెరిచి నెలవారీగా పెట్టుబడి పెట్టే మొత్తాన్ని ఎంచుకోవడం ద్వారా పెట్టుబడిని ప్రారంభించవచ్చు. దీని తరువాత 60 సంవత్సరాల వయస్సు తర్వాత ప్రతి నెల పెట్టుబడి మొత్తం ఆధారంగా మీకు పెన్షన్ ఇవ్వబడుతుంది.

APY పథకం ఎందుకు ప్రజాదరణ పొందింది

అటల్ పెన్షన్ యోజన ప్రారంభమైనప్పటి నుండి దానిలో నమోదుల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. 2021-22తో పోలిస్తే 2022-23లో 20 శాతం పెరిగింది. పథకం మొత్తం AUM రూ. 28,434 కోట్ల కంటే ఎక్కువ, పథకం ప్రారంభం నుండి 8.92 శాతం పెట్టుబడి రాబడిని ఆర్జించింది.