Site icon HashtagU Telugu

Atal Pension Yojana: అటల్ పెన్షన్ యోజన.. నెలకు రూ. 210 కాంట్రిబ్యూషన్‌తో రూ. 5 వేల పెన్షన్‌..!

Life Certificate

Select Old Pension Scheme Like This..

Atal Pension Yojana: దేశంలోని ప్రతి వర్గానికి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను అందజేస్తోంది. కోట్లాది మందికి వృద్ధాప్య ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం 2015 సంవత్సరంలో అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana)ను ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా ఖాతాదారులు సంవత్సరానికి రూ. 60,000 అంటే నెలవారీ రూ. 5,000 పెన్షన్ పొందవచ్చు. మేము ఈ పథకం వివరాలు, అర్హతను మీకు అందిస్తున్నాం.

అటల్ పెన్షన్ యోజన అంటే ఏమిటి?

ఇది పేద లేదా తక్కువ ఆదాయ ప్రజల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ప్రభుత్వ మద్దతు గల పెన్షన్ పథకం. పన్ను చెల్లింపుదారులు కాని 18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కింద రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. ఈ పథకంలో 5 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు ఉండటం గమనార్హం.

Also Read: 58000 Crorepatis : 58వేల మంది కోటీశ్వరులయ్యారు.. ఎలా అంటే ?

ఎంత పెట్టుబడి పెట్టాలి..?

అటల్ పెన్షన్ యోజన కింద 18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు నెలవారీ పెన్షన్ పొందవచ్చు. 18 ఏళ్ల వయసులో నెలకు రూ.42 పెట్టుబడి పెడితే, 60 ఏళ్ల తర్వాత రూ.1,000 పెన్షన్‌గా లభిస్తుంది. రూ.2,000 పెన్షన్ పొందడానికి రూ.84, రూ.3,000 పింఛను పొందడానికి రూ.126, రూ.4,000 పింఛను పొందడానికి రూ.168, నెలకు రూ.5,000 పింఛను పొందడానికి రూ.210పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే ఇది పెట్టుబడి ఆధారిత పెన్షన్ పథకం. దీనిలో మీరు డిపాజిట్ చేసిన మొత్తం ప్రకారం పెన్షన్ ప్రయోజనం పొందుతారు.

లబ్ధిదారుడు 60 ఏళ్లలోపు చనిపోతే?

ఒక లబ్ధిదారుడు 60 ఏళ్లలోపు మరణిస్తే అటువంటి పరిస్థితిలో అతని జీవిత భాగస్వామి పెన్షన్ ప్రయోజనం పొందడం కొనసాగుతుంది. ఒకవేళ ఆ వ్యక్తి జీవిత భాగస్వామి కూడా మరణిస్తే నామినీకి ఏకమొత్తం ప్రయోజనం లభిస్తుంది.

పథకం ప్రయోజనాన్ని ఎలా పొందాలి..?

– మీరు ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఈ ఖాతాను తెరవవచ్చు.
– ముందుగా బ్యాంకు లేదా పోస్టాఫీసుకు వెళ్లి దరఖాస్తు ఫామ్‌ను నింపండి.
– తర్వాత మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
– దీని తర్వాత మీ బ్యాంక్ వివరాలను సమర్పించండి. తద్వారా ప్రతి నెలా కొంత మొత్తం స్వయంచాలకంగా ఆ ఖాతా నుండి తీసివేయబడుతుంది. పథకంలో డిపాజిట్ చేయబడుతుంది.