Site icon HashtagU Telugu

KCR Delhi : కేసీఆర్ ఢిల్లీ ఆశ‌పై ‘ద్రావిడ’ చెక్‌

Kcr Rahul Stalin

Kcr Rahul Stalin

జాతీయ స్థాయిలో కీల‌క భూమిక పోషించ‌డానికి ద్రావిడ సిద్ధాంతాన్ని తమిళానాడు సీఎం స్టాలిన్ న‌మ్ముకున్నాడు. 2024 సాధార‌ణ ఎన్నిక‌ల్లో భార‌త ప్ర‌భుత్వ ఏర్పాటుకు కేంద్ర బిందువుగా మారాల‌ని భావిస్తున్నాడు. అందుకోసం ఒక ప‌క్కా ప్ర‌ణాళిక‌ను ఆయ‌న రచించాడు. ఆ విషయాన్ని త‌న జీవిత చ‌రిత్ర పుస్త‌క ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా వెల్ల‌డించాడు.1953లో ఆయన పుట్టినప్పటి నుండి ఫిబ్రవరి 1976లో ఎమర్జెన్సీ సమయంలో అంతర్గత భద్రత నిర్వహణ చట్టం (మిసా) కింద అరెస్టు చేయడం వరకు ప‌లు అంశాల‌ను ఆ పుస్త‌కంలో పొందుప‌రిచారు. ప్ర‌స్తుతం 38 మంది ఎంపీల బ‌లం ఉన్న డీఎంకే నాయ‌కుడు స్టాలిన్ బ‌ల‌మైన శ‌క్తిగా ఢిల్లీకి క‌నిపిస్తున్నాడు. అదే, కేవ‌లం 9 మంది ఎంపీలున్న కేసీఆర్ హ‌స్తిన‌కు ఆన‌డంలేదని టాక్‌. పైగా స్టాలిన్ దూకుడు, సిద్ధాంతాల‌పై జాతీయ స్థాయిలో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది.తమిళనాడు రాజకీయ దృశ్యంలో ఈ పుస్తకం ప్రాముఖ్యతను కలిగి ఉన్నప్పటికీ, తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి స్టాలిన్ ఫెడరలిజమ్‌పై దృష్టి పెట్టాడు. “ద్రావిడ నమూనా అన్ని జాతులకు సమాన హక్కులను విశ్వసిస్తుంది. రాష్ట్రాల యూనియన్ గా భార‌త‌దేశాన్ని రాజ్యాంగం వ‌ర్ణించింది. అన్ని రాష్ట్రాలకు అధిక అధికారాలు, సమాఖ్య హక్కులు ఉండాలి. రాష్ట్రాల యూనియన్‌గా ఉన్న భారత ప్రభుత్వం ఫెడరలిజం సూత్రాలకు అనుగుణంగా నడుచుకోవాలి’’ …ఇదే ద్రావిడ న‌మూనా అంటూ స్టాలిన్ నిన‌దించాడు.

ద్రావిడ నమూనాను దేశవ్యాప్తంగా ప్రచారం చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకే, జాతీయ నాయకులను పుస్త‌కావిష్క‌ర‌ణ‌కు ఆహ్వానించినట్లు వెల్ల‌డించాడు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌తో సహా రాజకీయ రంగానికి చెందిన పలువురు నేతలు హాజ‌రు కావ‌డం గ‌మ‌నార్హం.రాష్ట్రాలకు మరిన్ని హక్కులను కల్పించేలా రాజ్యాంగ సవరణలకు పిలుపునిస్తూ కాంగ్రెస్, వామపక్షాలు , ప్రాంతీయ పార్టీలు గళాన్ని వినిపించాలని స్టాలిన్ ఆ వేదిక‌పై పిలుపునిచ్చాడు. అక్క‌డ పాల్గొన్న అతిథులుగా స్టాలిన్ ప‌రిపాల‌న ద‌క్ష‌త‌ను కొనియాడారు. జాతీయ స్థాయిలో గొప్ప‌ పాత్ర పోషించడానికి సిద్ధం కావాల‌ని ఆకాంక్షించారుఉ. 2019లో (లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని ఫ్రంట్ 39 స్థానాలకు గాను 38 స్థానాలు గెలుచుకుంది), 2021లో (234 స్థానాలకు గాను 159 స్థానాలు గెలుచుకున్న అసెంబ్లీ ఎన్నికలు) మరియు ఇటీవల జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వరుస విజయాలు డీఎంకే సాధించిది. ఎన్నికల కారణాలతో కాకుండా బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌ను ఏర్పాటు చేసే సూచనలను స్టాలిన్ వదులుతున్నారు.స్టాలిన్ రూపొందించిన ఆల్-ఇండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్ “జాతీయ స్థాయిలో సామాజిక న్యాయం మరియు ఫెడరలిజం సూత్రాలను సాధించడం” లక్ష్యంగా పెట్టుకుంది. సమాఖ్య రూపంలోని ద్రావిడ సిద్ధాంతాన్ని స్టాలిన్ ప్రకటించాడు. ఈ సిద్ధాంతం పౌర హ‌క్కులు, పౌర సమాజంలోని సభ్యులు, భావసారూప్యత కలిగిన వ్యక్తులు మరియు సంస్థలను ఒక ఉమ్మడి వేదికపైకి తీసుకువస్తుంద‌ని విశ్వ‌సిస్తున్నాడు. ఈ ఫెడరేషన్‌లో భాగం కావాల్సిందిగా ఆహ్వానిస్తూ 37 సంస్థలకు స్టాలిన్ లేఖ రాయ‌డం జాతీయంగా సంచ‌ల‌నం క‌లిగిస్తోంది.

భారత రాజ్యాంగానికి చేసిన మొదటి సవరణను చూపుతూ రాష్ట్రాలకు నిశ్చయాత్మక చర్య తీసుకునే అధికారం ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలు మరియు కళాశాల సీట్లలో కుల ఆధారిత రిజర్వేషన్లు కల్పిస్తూ 1927లో ఆమోదించిన ప్రభుత్వ ఉత్తర్వును కొట్టివేస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ 1951లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఫలితంగా ఈ సవరణ జరిగింది. సైద్ధాంతిక పోరాటం కొనసాగుతుందని స్టాలిన్ ఈ సందర్భంగా సూచించారు. “1953లో తాను పుట్టినప్పుడు కుల కల్వి (కులం/వంశపారంపర్య విద్య)కి వ్యతిరేకంగా పోరాడిన విష‌యాన్ని గుర్తు చేశాడు. ఈరోజు నీట్‌కి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. విద్యార్థిగా ఉన్నప్పుడు హిందీని విధించడాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేసిన అవ‌శాన్ని అవ‌లోక‌నం చేశాడు. నేటికీ హిందీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నామ‌న్న విష‌యాన్ని గుర్తు చేశాడు. 1971లో అన్నా[అన్నాదురైతో క‌లిసి ఒక కార్యక్రమం నిర్వహించినప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొని సమాఖ్యవాదం కోసం మాట్లాడారు. అదే ఇప్పుడు దానిని కొనసాగిస్తున్నామని చెప్పాడు.ఫెడరలిజం మరియు సామాజిక న్యాయం యొక్క ఆలోచనలను ప్రచారం చేయడంలో స్టాలిన్ ఇప్పటికే దూకుడు పాత్ర పోషిస్తున్నారని వ‌క్త‌లు కొనియాడారు. 2024 ఎన్నికల సమయంలో అతను కొన్ని విభేదాలతో బిజెపియేతర పార్టీల మధ్య బలమైన శక్తిగా మారవచ్చని డిఎంకె అధికార ప్రతినిధి కాన్‌స్టాంటైన్ రవీంద్రన్ జోస్యం చెప్పాడు. వామపక్షాలు మరియు కాంగ్రెస్‌తో కలిసి మ‌మ‌త పనిచేయలేదు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో కలిసి సీపీఐ పనిచేయగలదు. కానీ కేరళ వంటి ప్రధాన రాష్ట్రంలో కాదు. ప్రాంతీయ పార్టీలు ఒంటరిగా పని చేయలేవు. స్టాలిన్ ప్రతి ఒక్కరితో క‌లివిడిగా వ్యవహరించవచ్చు. వాళ్ల‌ను ఒక ఉమ్మడి వేదికపైకి తీసుకురావచ్చు. జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించే ఫార్ములా ఆయనదే అంటూ వ‌క్త‌లు ఏకాభిప్రాయాన్ని వ్య‌క్త‌ప‌రిచారు. బిజెపికి జాతీయ ప్రత్యామ్నాయాన్ని రూపొందించడంలో స్టాలిన్ ఆసక్తి చూపుతున్నారనే వాదన తృతీయ ఫ్రంట్ గురించి పుకార్లకు సమర్ధవంతంగా ముగింపు పలికింది. ఇది స్టాలిన్ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండాలనే లక్ష్యంతో ఉన్న అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది. 2019లో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించిన తొలి నాయకుడు స్టాలిన్ అని సెంథిల్నాథన్ అభిప్రాయపడ్డారు. “వామపక్షాలు, కాంగ్రెస్ మరియు ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలనే ఆయన ఫార్ములా తమిళనాడులో విజయవంతమైంది. సో…2024 నాటికి స్టాలిన్ జాతీయ స్థాయిలో తిరుగులేని శక్తిగా ఎదుగుతాడ‌ని పుస్త‌కావిష్క‌ర‌ణ‌లో పాల్గొన్న అతిథులు విశ్వసించ‌డం కేసీఆర్ అడుగుల‌కు బ్రేక్ లు వేస్తోంది.