Site icon HashtagU Telugu

UP Stampede : యూపీలో తొక్కిసలాట.. భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య

UP Stampede

Up

యూపీలోని హత్రాస్ జిల్లా రతీభాన్పూర్లో (Uttar Pradesh’s Hathras) తొక్కిసలాట (Stampede Broke) జరిగిన సంఘటనలో 27 మంది మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని డాక్టర్స్ చెపుతున్నారు. భోలే బాబా సత్సంగ్ (Satsang) కార్యక్రమంలో ఒక్కసారిగా భక్తులు ఎగబడటంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 27 మంది మృతి చెందారు. వంద మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి. అందులో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆస్పత్రి ఎదుట ఉంచిన మృతదేహాల దృశ్యాలు కలిచివేస్తున్నాయి. వందల మంది భక్తులు ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ప్రమాదంపై ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ దిగ్భాంతి వ్యక్తం చేశఆరు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోలవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించాలని, ఘటనాస్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని జిల్లా యంత్రంగాన్ని ఆదేశించారు. ఈ ఘటనకు కారణాలపై దర్యాప్తు చేయాలని ఆగ్రా ఏడీజీని యోగి ఆదేశించారు. అలాగే ఈ ఘటనపై స్పందించిన ఇటా వైద్యాధికారి ఉమేశ్​ కుమార్​ త్రిపాఠి, ఇప్పటివరకు పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి 27మృతదేహాలు వచ్చాయని, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామని తెలిపారు.

Read Also : Kolikapudi Srinivasa Rao : ఆందోళనకు దిగిన కూటమి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు