Delhi : ఢిల్లీ ఎయిర్ పోర్టులో రూ. 27కోట్ల రిస్ట్ వాచ్ స్వాధీనం..!!

ఢిల్లీ ఎయిర్ పోర్టులో అత్యంత ఖరీదైన రిస్ట్ వాచ్ స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు.

  • Written By:
  • Publish Date - October 7, 2022 / 07:01 AM IST

ఢిల్లీ ఎయిర్ పోర్టులో అత్యంత ఖరీదైన రిస్ట్ వాచ్ స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఈ వాచ్ లో డైమండ్స్ పొదిగిన బంగారు బ్రాస్ లెట్లను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. అతని నుంచి స్వాదీనం చేసుకున్న వాచిల్లో ఒకటి బంగారు వజ్రాలతో పొదిగి ఉంది. దాని విలువు రూ. 27.09కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

ఈ వాచీల విలువ దాదాపు 60 కిలోల బంగారంతో సమానమని కస్టమ్స్ కమీషనర్ జుబైర్ రియాజ్ తెలిపారు. మంగళవారం దుబాయ్ నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికుడిని కస్టమ్స్ శాఖ అధికారులు తనిఖీ చేసినపుడు ఈ వాచీలు బయటపడ్డాయని చెప్పారు. నిందితుడు భారత పౌరుడు. అతని వస్తువులపై సమగ్ర పరిశీలన అనంతరం ఏడు చేతి గడియారాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

స్వాధీనం చేసుకున్న గడియారాల్లో జాకబ్ & కో (మోడల్: BL115.30A),పియాజెట్ లైమ్‌లైట్ స్టెల్లా (SI.No.1250352 P11179), రోలెక్స్ ఓస్టెర్ పెర్పెచ్యువల్ డేట్ జస్ట్ బ్రాండ్లకు చెందిన ఈ వాచీలు అత్యంత ఖరీదైనవని, వాటిలో జాకబ్ అండ్ కంపెనీ(మోడల్ బిఎల్115.30ఎ) విలువ రూ. 27.09 కోట్లని ఆయని తెలిపారు.