Journalist Fraud : జ‌ర్న‌లిస్ట్‌కు చెందిన 1.77 కోట్ల ఆస్తులు అటాచ్‌..

చారిటీ ముసుగులో ఓ జ‌ర్న‌లిస్ట్ చేసిన అక్ర‌మాల పుట్ట క‌దులుతోంది.

Published By: HashtagU Telugu Desk
Ayyub Khan

Ayyub Khan

చారిటీ ముసుగులో ఓ జ‌ర్న‌లిస్ట్ చేసిన అక్ర‌మాల పుట్ట క‌దులుతోంది. తాజాగా జ‌ర్న‌లిస్ట్ అయ్యూబ్ రాణాకు చెందిన దాదాపు 1.77 కోట్ల ఆస్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ జ‌ప్తు చేసింది. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని ఘ‌జియాబాద్ ఇందిరాపురం స్టేష‌న్‌లో 2021 ఆగ‌స్టు 28న వికాస్ సాంకృత్యాయ‌న్ అనే వ్య‌క్తి.. చారిటీ పేరుతో ఆమె అక్ర‌మంగా డ‌బ్బు వ‌సూలు చేసిన‌ట్టు కంప్ల‌యింట్ ఇచ్చాడు. ఈ కేసులో న‌మోద‌యిన ఎఫ్ ఐఆర్ ఆధారంగా ఈడీ ద‌ర్యాప్తు చేప‌ట్టింది.కోవిడ్ స‌మ‌యంలో రైతులు, పేద‌ల‌కు బీహార్‌, మ‌హారాష్ట్రల్లో తాను స‌హాయం చేస్తున్న‌ట్టు..ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ కెట్టో లో ఆయూబ్ త‌ప్పుడు కాంపెయిన్ల‌ను సృష్టించించిన‌ట్టు చెబుతున్నారు పోలీసులు. మూడు క్యాంపెయిన్ల ద్వారా మొత్తం ₹2,69,44,680 రూపాయ‌ల‌ను ఆమె తీసుకుంది. అందులో నుంచి కొంత మొత్తాన్ని ఆమె చెల్లెలు, తండ్రి ఖాతాల‌కు మ‌ళ్లించ‌డంతో పాటు ₹72,01,786 రూపాయ‌ల‌ను ఆమె ఖాతా నుంచి విత్‌డ్రా చేసిన‌ట్టు గుర్తించారు.

కెట్టో క్యాంపెయిన్ల ద్వారా సేక‌రించిన డబ్బులో త‌మె చెల్లి అకౌంట్‌కు 37ల‌క్ష‌లు, ఆమె తండ్రి ఇఫాత్ షేక్ అకౌంట్‌కు 1.60కోట్లు మ‌ళ్లించింది ఆయ్యూబ్‌. మ‌రో 50ల‌క్ష‌ల‌కు ఆమె పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ కూడా చేసింది. కోవిడ్ స‌మ‌యంలో పేద‌ల‌కు స‌హాయం చేసిన‌ట్టు చారిటీ ల నుంచి త‌ప్పుడు ప‌త్రాల‌ను ఆమె సృష్టించింది. ఈ మొత్తం దందాపై విచార‌ణ జ‌రుపుతున్న ఈడీ.. ఫిక్స్‌డ్ డిపాజిటఃతో పాటు ఆమె బ్యాంకు ఖాతాల‌ను సీజ్ చ‌శారు.

  Last Updated: 11 Feb 2022, 12:00 PM IST