PM Modi : త్వరలో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు: ప్రధాని మోడీ

Jammu And Kashmir: కేంద్రపాలిత ప్రాంతం(union territory) జమ్మూ కశ్మీర్‌(Jammu and Kashmir)కు రాష్ట్ర హోదా(State status) లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) అన్నారు. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు(Assembly elections) జరగనున్నాయని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగంగా శుక్రవారం ఉధంపూర్‌(Udhampur)లో బీజేపీ(bjp) నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌కు స్టార్ క్యాంపెయినర్‌గా మోదీ ప్రసంగించారు. ‘‘నాపై విశ్వాసం ఉంచితే 60 ఏళ్లుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని మాట ఇచ్చాను. జమ్ము […]

Published By: HashtagU Telugu Desk
Assembly Polls Will be Held in J&K Soon and Statehood will be Restored, says PM Modi Nation

Assembly Polls Will be Held in J&K Soon and Statehood will be Restored, says PM Modi Nation

Jammu And Kashmir: కేంద్రపాలిత ప్రాంతం(union territory) జమ్మూ కశ్మీర్‌(Jammu and Kashmir)కు రాష్ట్ర హోదా(State status) లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) అన్నారు. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు(Assembly elections) జరగనున్నాయని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగంగా శుక్రవారం ఉధంపూర్‌(Udhampur)లో బీజేపీ(bjp) నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌కు స్టార్ క్యాంపెయినర్‌గా మోదీ ప్రసంగించారు. ‘‘నాపై విశ్వాసం ఉంచితే 60 ఏళ్లుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని మాట ఇచ్చాను. జమ్ము కశ్మీర్‌లో అమ్మలు, అక్కాచెల్లెళ్లకు గౌరవం లభిస్తుందని హామీ ఇచ్చాను. పేదలు రోజుకు రెండు పూటల ఆహారం కోసం బాధపడకూడదని వాగ్దానం చేశాను. నేడు జమ్మూ కశ్మీర్‌లోని లక్షలాది కుటుంబాలు రాబోయే 5 ఏళ్లపాటు ఉచిత రేషన్ పొందుతాయని వాగ్దానం చేస్తున్నాను’’ అని మోడీ హామీ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

లోక్‌సభ ఎన్నికలు కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే కాదని, దేశంలో బలమైన ప్రభుత్వం ఏర్పాటుకు జరుగుతున్నాయని మోదీ అన్నారు. ప్రభుత్వం స్థిరంగా ఉన్నప్పుడే సవాళ్లను అధిగమించగలమని, పనులను పూర్తి చేయగలమని అన్నారు. బలహీన కాంగ్రెస్ ప్రభుత్వాలు దశాబ్దాల పాటు ఇక్కడి షాపుర్‌కండీ డ్యామ్‌ను ఎలా స్తంభింపజేశాయో గుర్తుండే ఉంటుందని మోడీ అన్నారు. కాంగ్రెస్ పనితీరు ఫలితంగా జమ్మూ రైతుల పొలాలు ఎండిపోయాయని, గ్రామాలు చీకటిలో మగ్గాయని మోడీ విమర్శలు గుప్పించారు. మన రావి నది నీళ్లు పాకిస్థాన్‌కు పోతుండేవని, రైతులకు హామీ ఇచ్చిన మోదీ నిలబెట్టుకున్నారని అన్నారు.

Read Also: Kavitha : కోర్టుకు ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ కస్టడీపై తీర్పు రిజర్వ్‌

కాగా ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఉధంపూర్‌లో భద్రతను బలగాలు కట్టుదిట్టం చేశాయి. బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. డ్రోన్‌ల ఎగరవేతపై బ్యాన్ విధించారు. మొదటి దశ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్ లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ బీజేపీ తరపున ఇక్కడ పోటీ చేస్తున్నారు. వరుసగా మూడోసారి తిరిగి ఎన్నికవ్వడమే లక్ష్యంగా ఆయన ప్రచారం చేస్తున్నారు.

  Last Updated: 12 Apr 2024, 01:14 PM IST