Site icon HashtagU Telugu

Punjab Elections : పంజాబ్ లో బీజేపీ, కెప్టెన్ సీట్ల పంపకం

Capt Amarinder Singh

Capt Amarinder Singh

పంజాబ్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో సీట్ల పంపకం మిత్రులతో బీజేపీ తేల్చేసింది. కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీతో సీట్ల పంపకాల ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాడు. 117 మంది సభ్యుల అసెంబ్లీలో, కెప్టెన్ కు చెందిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ 35 స్థానాల్లో, బీజేపీ 65 స్థానాల్లో పోటీ చేయనుండగా, సుఖ్ దేవ్ సింగ్ ధిండా నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్) 15 స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టనుంది. ఈ మూడు పార్టీలు కలిసి పంజాబ్ ఎన్నికలను కూటమిగా ఎదుర్కుంటాయి.పంజాబ్‌లో ఎన్డీయే సుస్థిరత, భద్రతను తీసుకువస్తుందని జేపీ నడ్డా నినాదాన్ని తయారు చేసాడు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే పంజాబ్‌లో సుస్థిరత, భద్రత కల్పిస్తామని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓటర్లకు హామీ ఇచ్చారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్‌తో సీట్ల పంపకాల సూత్రాన్ని ఖరారు చేసిన తర్వాత విలేకరుల సమావేశంలో నడ్డా మాట్లాడుతూ, రాష్ట్రం భారీ అప్పుల్లో ఉందని, “పంజాబ్‌పై ప్రత్యేక శ్రద్ధ అవసరం ఉందని తెలిపారు. భద్రత చాలా ముఖ్యమైన అంశం. ఈ ఎన్నికలు స్థిరత్వం మరియు భద్రత కోసం. పంజాబ్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడమే మా నినాదం” అని ఆయన అన్నారు. మూడు పార్టీల కూటమి పంజాబ్ లో ఎలా ముందుకు వేళ్తారో చూడాలి.