Site icon HashtagU Telugu

Poll Today : రాజస్థాన్‌లో ఓట్ల పండుగ.. 51,507 పోలింగ్‌ కేంద్రాల్లో క్యూ

Poll Today

Poll Today

Poll Today : రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. మొత్తం 200 అసెంబ్లీ స్థానాలకుగానూ 199 చోట్ల ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ షురూ అయింది. 51,507 పోలింగ్‌ కేంద్రాల్లో 5,26,90,146 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని డిసైడ్ చేయనున్నారు. ఓటర్లలో 18-30 ఏళ్లవారు 1.70 కోట్ల మంది, 18-19 ఏళ్లవారు 22.61 లక్షల మంది ఉన్నారు. శ్రీగంగానగర్‌ జిల్లాలోని కరణ్‌పూర్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే గుర్మీత్ సింగ్ కూనార్ మృతి చెందడంతో ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈసారి రాష్ట్రంలో మొత్తం 1,862 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

ప్రధాన కాంగ్రెస్ అభ్యర్థులు

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా, అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి, మంత్రి శాంతి ధరివాల్, బిడి కల్లా, భన్వర్ సింగ్ భాటి, సలేహ్ మహ్మద్, మమతా భూపేష్, ప్రతాప్ సింగ్ ఖాచరియావాస్, రాజేంద్ర యాదవ్, శకుంత్లా రావత్, మంత్రులు ఉదయ్ లాల్ అంజనా, మహేంద్రజీత్ సింగ్ మాల్వియా, అశోక్ చందనా.

ప్రధాన బీజేపీ అభ్యర్థులు

మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే,  ఎంపీలు దియా కుమారి, రాజ్యవర్ధన్ రాథోడ్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రాజేంద్ర రాథోడ్, ప్రతిపక్ష ఉపనేత సతీష్ పూనియా, బాబా బాలక్‌నాథ్, కిరోడీ లాల్ మీనా, దివంగత కిరోడి సింగ్ బైన్స్లా కుమారుడు విజయ్ బైంస్లా.

We’re now on WhatsApp. Click to Join.

ప్రధాన పార్టీలు

ఈసారి బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ 2018 ఎన్నికల మాదిరిగానే దాని మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) కోసం భరత్‌పూర్‌లో ఒక స్థానాన్ని వదిలేసింది. బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు సీపీఐ (ఎం), ఆర్‌ఎల్‌పీ, భారత్ ఆదివాసీ పార్టీ, భారతీయ గిరిజన పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, మజ్లిస్ వంటి ఇతర పార్టీలు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌లకు చెందిన 40 మంది రెబల్స్‌ కూడా పోటీలో ఉన్నారు.

2018 ఫలితాలు

2018లో కాంగ్రెస్ 99 సీట్లను గెలుచుకోగా, బీజేపీ 73 సీట్లను గెలుచుకుంది. బీఎస్పీ ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతుతో అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు 107 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకి 70 మంది, రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ (ఆర్‌ఎల్‌పీ)కి ముగ్గురు, సీపీఐ (ఎం)కు ఇద్దరు, భారతీయ గిరిజన పార్టీ (బీటీపీ), రాష్ట్రీయ లోక్‌దళ్‌‌లకు ఒక్కో ఎమ్మెల్యే, 13 మంది స్వతంత్రులు(Poll Today) ఉన్నారు.

Also Read: PM Modi : ‘ఎస్సీ వర్గీకరణ’ కమిటీ ఏర్పాటు స్పీడప్.. కేబినెట్ సెక్రటరీకి ప్రధాని మోడీ ఆదేశాలు