PM Modi: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని నింపాయి: ప్రధాని మోడీ

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మూడింట బీజేపీ విజయం సాధించింది.

Published By: HashtagU Telugu Desk
PM Modi Slept on Train Floor

Narendra Modi Creates new record in America modi visits America soon

PM Modi: డిసెంబర్‌ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మొత్తం 15 రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనేక బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మూడింట బీజేపీ విజయం సాధించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అంతకుముందు మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

ప్రజల ఆశయాలను బలోపేతం చేయడానికి ప్రజాస్వామ్య ఆలయమే కీలకం అని ప్రధాని మోదీ అన్నారు. ఇక.. పార్లమెంట్‌ సమావేశాలకు వచ్చే సభ్యులంతా ప్రిపేరు కావాలనీ.. బిల్లుల గురించి సభలో చర్చ సజావుగా సాగాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రతిపక్ష ఎంపీలు సహకరించాలని కోరారు. తాజాగా ఆయా రాష్ట్రాల్లో వెలువడ్డ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్సాహాన్ని నింపుతున్నాయని అన్నారు.

మహిళలు, యువత, రైతులు, పేదల పక్షాన ఉన్నవారికి అనూహ్యమైన మద్దతు లభిస్తోందని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని.. అలాంటి తపన ఉంటే ప్రజా వ్యతిరేకత ఏమాత్రం ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ ఆయన తేల్చి చెప్పారు. ఇక తెలంగాణపై ఫలితాలపై ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అభివుద్ధి కోసం తమవంతుగా పాటు పడుతామని తెలిపారు.

  Last Updated: 04 Dec 2023, 12:04 PM IST