Assam: అస్సాంలో భారీ అగ్నిప్రమాదం..100కి పైగా దుకాణాలు దగ్ధం

అస్సాం (Assam)లోని జోర్హాట్ జిల్లా చౌక్ బజార్ ప్రాంతంలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పలు వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

  • Written By:
  • Publish Date - February 17, 2023 / 06:55 AM IST

అస్సాం (Assam)లోని జోర్హాట్ జిల్లా చౌక్ బజార్ ప్రాంతంలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పలు వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దాదాపు 100కి పైగా దుకాణాలు దగ్ధమైనట్లు సమాచారం. సమాచారం ప్రకారం.. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎటి రోడ్‌లోని చౌక్ మార్కెట్‌లో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే 100కి పైగా దుకాణాలు దగ్ధమయ్యాయి. భయంకరమైన మంటలు కనిపించాయి. ప్రస్తుతం ప్రాణనష్టం గురించి ఎలాంటి సమాచారం లేదు.

జోర్హాట్ నగరం నడిబొడ్డున ఉన్న చౌక్ బజార్ వద్ద 25 ఫైర్ టెండర్లు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నాయని పోలీసు అధికారులు తెలిపారు. ఓ దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. మంటలు చెలరేగడంతో రద్దీ మార్కెట్‌లో వేగంగా వ్యాపించిందని తెలిపారు. షాపులన్నీ మూసి వేసి యజమానులు, ఉద్యోగులు ఇళ్లకు వెళ్లిపోయినందున ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. మంటలు చెలరేగిన దుకాణాల్లో ఎక్కువగా బట్టలు, కిరాణా షాపులే ఉన్నాయని తెలిపారు. భారీ మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు సమీప నగరాల నుంచి అదనపు అగ్నిమాపక యంత్రాలను రప్పించినట్లు అధికారులు తెలిపారు.

రోడ్డు ఇరుకుగా ఉండడంతో అగ్నిమాపక వాహనాలు ఆలస్యం
.
అదే సమయంలో ఇరుకైన రోడ్ల కారణంగా అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ఇబ్బందిగా ఉందని స్థానికులు తెలిపారు. మంటలను ఆర్పిన తర్వాతే నష్టం అంచనా వేయగలమని పోలీసులు తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌లో జోర్హాట్‌లోని మార్వాడీ పట్టి ప్రాంతంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో అనేక దుకాణాలు దగ్ధమయ్యాయి.