Bharat Jodo Nyay Yatra : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)గువహటిలో చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా చెలరేగిన ఘర్షణల కేసులో అసోం సీఐడీ సీఎల్పీ నేత దేవబ్రత సైకియా, పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ భూపేన్ కుమార్ బోరాలను రెండోసారి ప్రశ్నించేందుకు మంగళవారం సమన్లు జారీ చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
గువహటి(Guwahati)లోని ఉలుబరిలో సీఐడీ పోలీస్ స్టేషన్ ఎదుట ఈనెల 6న హాజరు కావాలని సమన్లలో దేవబ్రత సైకియాను సీఐడీ కోరింది. ఇక భూపేన్ కుమార్ బోరా ఈనెల 7న సీఐడీ ఎదుట హాజరు కావాలని సమన్లలో పేర్కొంది. ఈ కేసులో ఇంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే జాకీర్ హుస్సేన్ సిక్దర్, మరో అసోం పీసీసీ నేతకు సీఐడీ సమన్లు జారీ చేసింది.
read also : Bengaluru: తాగునీటిని దుర్వినియోగం చేస్తే రూ.5వేలు జరిమానా
అసోం సీఐడీ గతంలో పిబ్రవరి 26న దేవబ్రత సైకియాకు సమన్లు జారీ చేసింది. జనవరి 23న ఘర్షణలు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం ఆరోపణలపై వివిధ సెక్షన్ల కింద బసిస్ట పోలీస్ స్టేషన్‌లో దేవబ్రత సైకియా, భూపేన్ కుమార్ బోరాపై ఎఫ్ఐఆర్ నమోదైందని, దీనికి సంబంధించి ప్రశ్నించేందుకు వీరికి సమన్లు జారీ చేశామని సీనియర్ పోలీస్ అధికారి వివరించారు.