భారత రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం రాసిన ఆసియా తొలి మహిళా లోకో పైలట్ సురేఖా యాదవ్ (Surekha Yadav) ఈ నెల 30న విధుల నుండి విరమణ పొందనున్నారు. మొత్తం 36 ఏళ్లపాటు అద్భుతమైన సేవలందించిన ఆమె, రైల్వే రంగంలో మాత్రమే కాదు, సమాజంలోనూ మహిళల సాధికారతకు ప్రతీకగా నిలిచారు. రైల్వే ఉద్యోగం అంటే ఒకప్పుడు పురుషులకు మాత్రమే పరిమితమైపోయిన కాలంలో, సురేఖా యాదవ్ ఆ బంధనాలను ఛేదించి, దేశవ్యాప్తంగా లక్షలాది మహిళలకు స్ఫూర్తినిచ్చారు.
Fight At Apple Store : ఐఫోన్ 17 కోసం స్టోర్ల వద్ద కొట్లాట .ఏంటి సామీ ఈ పిచ్చి
1988లో లోకో పైలట్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన సురేఖా, అనేక ముఖ్యమైన రైళ్లను నడిపారు. కేవలం ఉద్యోగం చేయడం మాత్రమే కాకుండా, తన క్రమశిక్షణ, కష్టపడే తత్వం, నిబద్ధతతో రైల్వేలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. మొదట్లో అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ, వాటిని అధిగమించి, మహిళలు ఏ రంగంలోనైనా ప్రతిభ చాటగలరని నిరూపించారు. ఆమె సాధించిన విజయాలు రైల్వేలో మాత్రమే కాకుండా, సర్వసామాన్యంగా మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాయి.
సురేఖా యాదవ్ రిటైర్మెంట్‌తో ఒక యుగం ముగిసినట్లే. కానీ ఆమె స్ఫూర్తిదాయకమైన ప్రయాణం ఎప్పటికీ మరువలేనిది. మహిళా సాధికారత, సమానావకాశాల ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ, రాబోయే తరాల మహిళలకు ఆమె జీవితం మార్గదర్శకంగా నిలుస్తుంది. “ఏ కల అయినా సాధ్యం” అని చూపిన సురేఖా, దేశ చరిత్రలో స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా చిరస్థాయిగా నిలిచిపోతారు.

