Chenab Rail Bridge : ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి ఎలా ఉందో చూస్తారా..?

ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టిన ప్రాంతం ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఉన్నందున వివిధ ఐఐటీ నిపుణుల సలహాలు, సూచనలమేరకు రూపొందించారు

  • Written By:
  • Publish Date - March 26, 2024 / 11:55 AM IST

ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయ్యింది. జమ్మూలోని రీసి జిల్లాలో చేనాబ్ నదిపై ‘చీనాబ్ బ్రిడ్జి’ (Chenab Rail Bridge) ని పూర్తి చేసారు. నదికి రెండువైపులా ఉన్న కొండల మధ్య ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో దాదాపు 1,178 అడుగుల (359 మీటర్ల) సింగిల్ ఆర్చ్ విధానంలో నిర్మించారు. దీంతో భారత స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారిగా శ్రీనగర్ దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం కానుంది.

ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి 2003లోనే అనుమతి లభించినా పూర్తవ్వడానికి 19 ఏళ్లు పట్టింది. తొలుత దీన్ని 2009 కల్లా పూర్తి చేయాలని చూశారు. కానీ, కొన్ని కారణాల వల్ల 2008లోనే నిర్మాణ పనులను నిలిపివేశారు. మళ్లీ 2017 నుంచి పునర్ నిర్మాణ పనులు మొదలుపెట్టి పూర్తి చేసారు. దాదాపు 1500 కోట్లతో ఈ బ్రిడ్జ్ ని నిర్మించారు. ప్రత్యేక స్టీల్‌తో ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి పూనుకోగా అందులో కాంక్రీట్ కూడా వినియోగించారు. దీంతో దీన్ని అత్యంత పటిష్టంగా రూపొందించారు.

We’re now on WhatsApp. Click to Join.

దీని నిర్మాణానికి 25వేల టన్నుల ఇనుము అవసరమవుతుందని అంచనా. ఇంద్రధనుస్సు (ఆర్క్) ఆకారంలో నిర్మిస్తున్న ఈ వంతెన విడిభాగాలను చీనాబ్ నది పక్కనే తయారుచేసి రెండు కేబుల్ కార్ల సాయంతో వంతెనకు జత చేసారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టిన ప్రాంతం ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఉన్నందున వివిధ ఐఐటీ నిపుణుల సలహాలు, సూచనలమేరకు రూపొందించారు. అలాగే భూకంప ప్రకంపనలను సైతం తట్టుకొనే విధంగా నిర్మించడం విశేషం. ఈ బ్రిడ్జ్ జీవిత కాలం సుమారు 120 ఏళ్లు ఉంటుందని అంచనా. మరి ఇన్ని విశేషాలు ఉన్న బ్రిడ్జ్ ఎలా ఉందో చూడండి అంటూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) ట్విట్టర్ లో షేర్ చేసారు.

Read Also : AAP: ప్రధాని నివాసం ముట్టడికి ఆప్ పార్టీ పిలుపు..ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం