Ashok Gehlots big claim : పొలిటికల్ బాంబు పేల్చిన అశోక్ గెహ్లాట్.. రాజకీయ వర్గాల్లో కలకలం

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన కామెంట్స్(Ashok Gehlots big claim)  చేశారు.

  • Written By:
  • Publish Date - May 8, 2023 / 11:16 AM IST

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన కామెంట్స్(Ashok Gehlots big claim)  చేశారు. 2020 జులైలో 18 మంది ఎమ్మెల్యేలతో సచిన్ పైలట్ తిరుగుబాటు చేసినప్పుడు.. తన నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోకుండా మాజీ సీఎం, బీజేపీ నేత వసుంధర రాజే సింధియా, మరో ఇద్దరు నేతలు తనకు సాయం చేశారంటూ పొలిటికల్ బాంబు (Ashok Gehlots big claim) పేల్చారు. తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, ధర్మేంద్ర ప్రధాన్‌లు కలిసి అప్పట్లో కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. ధోల్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అశోక్ గెహ్లాట్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ కేంద్ర మంత్రులు తమ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలకు డబ్బు ఎరగా వేశారని మండిపడ్డారు. అయితే బీజేపీ నేతలు వసుంధరా రాజే, మాజీ స్పీకర్ కైలాశ్‌ మేఘ్‌వాల్, ఎమ్మెల్యే శోభారాణి కుష్వాహల వల్లే తన ప్రభుత్వం నిలబడిందని చెప్పారు.

Congress: రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో మళ్ళీ రచ్చ

“గతంలో భైరోన్ సింగ్ షెకావత్ నేతృత్వంలోని బీజేపీ సర్కారును కూల్చివేసే అవకాశం వచ్చినా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్‌గా నేను అందుకు మద్దతు ఇవ్వలేదు.. అదే విధంగా 2020లోనూ మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కేంద్ర మంత్రులకు రాజే, మేఘ్‌వాల్, కుష్వాహలు బీజేపీకి మద్దతు ఇవ్వలేదు” అని గెహ్లాట్ వ్యాఖ్యానించారు. 2020లో ప్రభుత్వంపై తిరుగుబాటు గురించి తనను అప్రమత్తం చేసినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రోహిత్ బోహ్రా, చేతన్ దూడి, డానిష్ అబ్రార్‌లను గెహ్లాట్ ప్రశంసించారు. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కామెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.