Ashok Gehlot : మోడీతో రాజ‌స్థాన్ కాంగ్రెస్ సీఎం చెట్టాప‌ట్టాల్‌

కాంగ్రెస్, బీజేపీ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా రాజ‌కీయం న‌డుస్తోంది. రాజ‌స్థాన్ లో  (Ashok Gehlot)

  • Written By:
  • Updated On - May 6, 2023 / 02:30 PM IST

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా రాజ‌కీయం న‌డుస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజ‌స్థాన్ లో  (Ashok Gehlot) ఆ వేడి క‌నిపించ‌డం లేదు. ప్ర‌ధాని మోడీ రాజ‌స్థాన్ వెళ్లిన సంద‌ర్భంగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ సీఎం గెహ్లాట్ క‌లిమెలిసి ఉన్నారు. వందేభార‌త్(Vande Bharat) రైలు ప్రారంభోత్స‌వానికి మోడీతో పాటు హాజ‌ర‌య్యారు. గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా గెహ్లాట్ ను ఒక మంచి మిత్రునిగా మోడీ పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ మ‌ధ్య ర‌గులుతోన్న రాజ‌కీయాన్ని చ‌ల్ల‌బ‌రిచేలా రాజ‌స్థాన్ కాంగ్రెస్ పోక‌డ ఉంది.

కాంగ్రెస్, బీజేపీ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గు..(Ashok Gehlot)

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను  (Ashok Gehlot) స్నేహితుడిగా ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభాలు ఉన్నప్పటికీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభ కార్యక్రమానికి హాజరైన గెహ్లాట్ ను మోడీ ప్రశంసించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వందే భారత్ (Vande Bharat) ఎక్స్‌ప్రెస్ ఫ్లాగ్‌ఆఫ్ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన‌ డిమాండ్లతో పాటు కాంగ్రెస్‌లో కొనసాగుతున్న రాజకీయ గొడవలను ప్రధాని మోదీ ఎత్తి చూపారు. “గెహ్లాట్ జీ ఈ రోజుల్లో అనేక రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొంటున్నందున నేను ఆయనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అతను అభివృద్ధి పనుల కోసం సమయాన్ని వెచ్చించి రైల్వే కార్యక్రమంలో పాల్గొన్నాడు. నేను ఆయనకు స్వాగతం పలుకుతున్నాను” అని ప్రధాని మోదీ అన్నారు.

మోడీతో కాంగ్రెస్ సీఎం గెహ్లాట్ క‌లిమెలిసి

జైపూర్‌ జంక్షన్‌ రైల్వేస్టేషన్‌లో వందేభారత్‌ (Vande Bharat)ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. రైల్వే మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్ ఇద్దరూ రాజస్థాన్‌కు చెందిన వారని ప్రధాని ప్రస్తావిస్తూ, “మీ రెండు చేతుల్లో లడ్డూలు ఉన్నాయని నేను గెహ్లాట్ జీ కి చెప్పాలనుకుంటున్నాను. రైల్వే మంత్రి రాజస్థాన్‌కు చెందినవాడు మరియు చైర్మన్ రైల్వే బోర్డు కూడా రాజస్థాన్‌కు చెందినది.` అంటూ మోడీ చ‌మ‌త్క‌రించారు.

స‌చిన్ పైలెట్ రూపంలో సంక్షోభం

“స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే చేయాల్సిన పని ఇప్పటి వరకు జరగలేదు. కానీ నా మీద నీకు అంత నమ్మకం ఉంది. కాబట్టి ఆ పనిని ఈరోజు నా ముందు ఉంచావు. ఇదే నీ నమ్మకం… నీ నమ్మకమే బలం. నా స్నేహానికి సంబంధించి.. స్నేహంపై మీకున్న నమ్మకానికి నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని ప్రధాని మోదీ తెలిపారు. ఇలా గెహ్లాట్ మీద స్నేహ‌భావాన్ని, సానుభూతిని చ‌మ‌త్కార‌మైన మాట‌ల ద్వారా మోడీ తెలియ‌చేడం గ‌మ‌నార్హం.

Also Read : Sachin Pilot Protest: పైలట్ ఫైర్.. సొంత ప్రభుత్వంపై నిరసన జ్వాలలు!

ప్ర‌స్తుతం రాజ‌స్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ అంత‌ర్గ‌త విభేదాల‌తో అట్టుడికిపోతోంది. స‌చిన్ పైలెట్ రూపంలో సంక్షోభం వెంటాడుతోంది. ఇలాంటి స‌మ‌యంలో మోడీ కార్య‌క్ర‌మానికి అశోక్ గెహ్లాట్  (Ashok Gehlot)  హాజ‌రు కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మాజీ సీఎం వ‌సుంధ‌ర రాజే సింధియా అవినీతి మీద విచార‌ణ జ‌ర‌పాల‌ని స‌చిన్ పైలెట్ గ‌త రెండు రోజులుగా నిరాహార‌దీక్ష‌కు దిగారు. ఆమెతో గెహ్లాట్ ప్ర‌భుత్వం లాలూచీప‌డింద‌చిన సొంత పార్టీని ఇర‌కాటంలో పెట్టేలా స‌చిన్ పైలెట్ రోడ్డెక్కారు. ఇలాంటి సంక్షోభం నడుమ మోడీ ఆశీర్వాదాల‌ను గెహ్లాట్ తీసుకోవ‌డం ప‌లు రాజ‌కీయ ఊహాగానాల‌కు దారితీస్తోంది.

Also Read : Sachin Pilot Against Gehlot: రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో మరోసారి అసమ్మతి సెగ.. నిరాహార దీక్షకు మాజీ డిప్యూటీ సీఎం