Ashok Chavan: కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి అశోక్ చవాన్.. కమల్‌నాథ్ కూడా.. ?

Ashok Chavan : లోక్‌సభ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీకి  షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి.

  • Written By:
  • Updated On - February 12, 2024 / 03:00 PM IST

Ashok Chavan : లోక్‌సభ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీకి  షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశారు.  ఈ మేరకు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలేకు లేఖ రాశారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలేతో నెలకొన్న విభేదాల వల్లే చవాన్ రాజీనామా చేశారని సమాచారం.రాజీనామాకు ముందు చవాన్.. అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌తో భేటీ అయ్యారు. ఆదివారం రోజు బీజేపీతో చర్చలు జరిపిన తర్వాత రాజీనామాపై చవాన్ ప్రకటన చేశారని తెలుస్తోంది. అశోక్ చవాన్ బీజేపీ గూటికి చేరుతారని అంచనా వేస్తున్నారు. ఆయన వెంట మరికొంత మంది సీనియర్ నాయకులు కూడా బీజేపీలోకి వెళ్తారని అంటున్నారు. చవాన్‌కు(Ashok Chavan) బీజేపీ రాజ్యసభ సీటును ఆఫర్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. ఈ పరిణామంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ..చవాన్ బీజేపీలో చేరుతున్నట్టు తనకు సమాచారం లేదన్నారు. చాలామంది నేతలు బీజేపీతో టచ్‌లో ఉన్నది మాత్రం వాస్తవమేనని వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join

ప్రస్తుతం భోకర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న చవాన్.. 2008 డిసెంబర్ నుంచి 2010 నవంబర్ వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల మహారాష్ట్రలో కాంగ్రెస్ సీనియర్ లీడర్లు బాబా సిద్దీఖ్, మిలింద్ దేవరా పార్టీకి రిజైన్ చేయగా.. ఇప్పుడు ఆ జాబితాలో అశోక్ చవాన్ కూడా చేరిపోయారు. మిలింద్ దేవర మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గం శివసేనలో చేరగా.. బాబా సిద్దీఖ్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వర్గం ఎన్సీపీలోకి చేరడం గమనార్హం. దీంతో పార్లమెంటు ఎన్నికల ముంగిట మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

Also Read : Rahul Gandhi : విద్యార్థుల కోసం రాహుల్‌‌ త్యాగం.. ‘న్యాయ్’ యాత్రలో కీలక నిర్ణయం

మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ కూడా బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.  మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన టైంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కమల్ నాథ్ వ్యవహరించారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఎన్నికలు ముగిసిన వెంటనే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి కమల్ నాథ్‌ను తప్పించారు. నాటి నుంచి కాంగ్రెస్ పెద్దలపై కమల్ నాథ్ గుర్రుగా ఉన్నారు. ఈనేపథ్యంలో బీజేపీ పెద్దలు కమల్ నాథ్‌తో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రాజ్యసభ సీటు ఆఫర్ ఇచ్చి.. కమల్ నాథ్‌ను కాంగ్రెస్‌లోకి బీజేపీ అగ్రనేతలు ఆహ్వానించారని సమాచారం. బీజేపీలో చేరికపై కమల్ నాథ్ త్వరలోనే ప్రకటన చేస్తారని అంటున్నారు.