సెంట్ర‌ల్ ఢిల్లీలో ఫైట్ .. హిందూసేన వ‌ర్సెస్ ఎంఐఎం

సెంట్ర‌ల్ ఢిల్లీ..పైగా అశోక్ రోడ్డుకు ఇరువైపులా దేశంలోని అత్యున్న‌త ప‌దవుల్లో ఉన్న ప్ర‌ముఖులు నివ‌సిస్తుంటారు. అక్క‌డే ప్ర‌ధాని, ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్, పోలీస్ క‌మిష‌న‌రేట్..ఇలా అన్నీ ఉంటాయి. భ‌ద్ర‌త చాలా క‌ట్టుదిట్టంగా ఉంటుంది. ఆ రోడ్డులోనే ఎంపీ అస‌రుద్దీన్ ఓవైసీ నివాసం.

  • Written By:
  • Publish Date - September 22, 2021 / 02:28 PM IST

సెంట్ర‌ల్ ఢిల్లీ..పైగా అశోక్ రోడ్డుకు ఇరువైపులా దేశంలోని అత్యున్న‌త ప‌దవుల్లో ఉన్న ప్ర‌ముఖులు నివ‌సిస్తుంటారు. అక్క‌డే ప్ర‌ధాని, ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్, పోలీస్ క‌మిష‌న‌రేట్..ఇలా అన్నీ ఉంటాయి. భ‌ద్ర‌త చాలా క‌ట్టుదిట్టంగా ఉంటుంది. ఆ రోడ్డులోనే ఎంపీ అస‌రుద్దీన్ ఓవైసీ నివాసం. భ‌ద్ర‌త చాలా ఎక్కువ‌గా ఉంటుంద‌ని అనుకుంటారు. కానీ, ఓవైసీ ఇంటిపై హిందూసేన స‌భ్యులు దాడికి దిగారు. ఇంటి అద్దాలు, ఫ‌ర్నిచ‌ర్, కిటికీలు, సోఫాల‌ను ధ్వంసం చేశారు. అంతేకాదు, 40 ఏళ్లుగా ఓవైసీ ఇంటికి వాచ్ మెన్ రాజుపై దుర్భాష‌లాడారు. దాడి దిగార‌ని రాజు ఫిర్యాదు చేశారు. వెంట‌నే అప్ర‌మ‌త్తమైన ఢిల్లీ డిప్యూటీ క‌మిష‌న‌ర్ దీప‌క్ యాద‌వ్ దుండ‌గుల‌ను అదుపులోకి తీసుకున్నారు.
కేసును ద‌ర్యాప్తు చేస్తున్నారు.
ఓవైసీ ఇంటిపైన‌, ఆయ‌న మీద దాడి చేసిన సంఘ‌ట‌న‌లు అనేకం ఉన్నాయి. ఇంటి మీద ఇప్ప‌టికి మూడుసార్లు దాడికి ప్ర‌య‌త్నించార‌ని ఓవైసీ ట్వీట్ చేశారు. ప్ర‌ధాని, స్పీక‌ర్, పోలీస్ క‌మిష‌న‌ర్ ఇళ్ల‌కు స‌మీపంలోనే ఉన్న నివాసానికి కూడా భ‌ద్ర‌త లేద‌ని. ట్వీట్ చేశారు. ఆ మేర‌కు ప్రధానికి ఓవైసీ ఫిర్యాదు చేశారు. అతివాదులు చేసిన దాడిగా పేర్కొన్నారు. హిందుత్వం పేరుతో దేశంలో అస‌హ‌నాన్ని పెంచుతున్నార‌ని ఓవైసీ ట్వీట్ చేశారు. ఇలాగే కొన‌సాగితే, ఎంఐఎం చూస్తూ ఊరుకోద‌ని హెచ్చ‌రించారు.
ఎంపీ అస‌రుద్దీన్, ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ప్ర‌సంగాలు హిందువుల‌ను రెచ్చ‌గొట్టేవిగా ఉంటాయి. సున్నిత‌మైన మ‌త ప‌ర‌మైన అంశాల‌ను లేవ‌నెత్తుతారు. స‌రిగ్గా అవే, బీజేపీ నేత‌ల‌కు, క్యాడ‌ర్ కు ఆగ్ర‌హం క‌లిగిస్తున్నాయి. హిందూవుల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌సంగాలు ఉంటాయ‌ని హిందూసేన ఈసారి కూడా భావించింది. సేన ఢిల్లీ విభాగానికి చెందిన సుమారు 15 మంది ఓవైసీ స్పీచ్ మీద ఆగ్ర‌హించారు. ఓవైసీ లేని స‌మ‌యంలో ఇంటి మీద దాడికి దిగారు. వాళ్ల‌లో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వాళ్ల కోసం అన్వేషిస్తున్నారు. మ‌త‌ప‌ర‌మైన ఘ‌ర్ష‌ణ‌లు రాకుండా పోలీసులు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.
మ‌త‌ప‌ర‌మైన స్పీచ్ ఇచ్చిన అక్బ‌రుద్దీన్ ను ఒక‌సారి తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్య‌మంత్రిగా కిర‌ణ్ కుమార్ రెడ్డి ఉన్న‌ప్పుడు ఆ అరెస్ట్ జ‌రిగింది. ఆ త‌రువాత ఎంఐఎం నేత‌లు, క్యాడ‌ర్ ఏ విధంగా మాట్లాడిన‌ప్ప‌టికీ పోలీసులుగానీ, ప్ర‌భుత్వాలుగానీ చ‌ర్య‌లు తీసుకున్న దాఖ‌లాలు లేవు. దేశ వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో విస్త‌రిస్తోన్న ఎంఐఎం ఆయా రాష్ట్రాల్లో మ‌త‌ప‌ర‌మైన ప్ర‌సంగాలు చేస్తోంది. అందుకు ఆగ్ర‌హించిన హిందూసేన దాడికి దిగింది. భ‌ద్ర‌త ఇవ్వాల‌ను కోరుతోన్న అస‌రుద్దీన్ భ‌విష్య‌త్ లో స్పీచ్ గురించి మాత్రం ఎలాంటి మార్పులు ఉండ‌వ‌ని హెచ్చ‌రించారు. ఫ‌లితంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌తం అనే అస్త్రం ఎలా ప‌నిచేస్తుందో చూడాలి