Malegaon Bomb Blast Case Verdict : ఆ ఆరుగురిని చంపింది ఎవరు? – అసదుద్దీన్

Malegaon Bomb Blast Case Verdict : "ఇంతకీ ఆ ఆరుగుర్ని ఎవరు చంపారు?" అంటూ ఆయన చేసిన ప్రశ్నాస్త్రం కేసులోని లోపాలను, న్యాయం జరగలేదన్న భావనను ప్రతిబింబిస్తుంది

Published By: HashtagU Telugu Desk
Asaduddin Owaisi On Malegao

Asaduddin Owaisi On Malegao

మాలేగావ్ బాంబు పేలుడు కేసు(Malegaon Bomb Blast Case)లో ముంబైలోని NIA కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల MIM చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. పేలుడు ఘటనలో మసీదు సమీపంలో ఆరుగురు మరణించారని, 100 మందికి పైగా గాయపడ్డారని ఆయన గుర్తుచేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిని నిర్దోషులుగా విడుదల చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఈ తీర్పు తనను నిరాశకు గురిచేసిందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఒవైసీ పలు ప్రశ్నలు సంధించారు. “నిర్దోషుల విడుదలను నిలిపివేయాలని మోదీ, ఫడణవీస్ ప్రభుత్వాలు అప్పీల్‌కు వెళ్తాయా? మహారాష్ట్రలోని సెక్యులర్ పార్టీలు జవాబుదారీతనం కోరుతాయా?” అని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో నిజమైన దోషులను పట్టుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. “ఇంతకీ ఆ ఆరుగుర్ని ఎవరు చంపారు?” అంటూ ఆయన చేసిన ప్రశ్నాస్త్రం కేసులోని లోపాలను, న్యాయం జరగలేదన్న భావనను ప్రతిబింబిస్తుంది.

Kingdom : మనం కొట్టినం విజయ్ – రష్మిక ట్వీట్

ఈ తీర్పు రాజకీయంగానూ, సామాజికంగానూ చర్చకు దారితీసే అవకాశం ఉంది. బాంబు పేలుడులో ప్రాణాలు కోల్పోయినవారికి న్యాయం జరగలేదన్న భావనను ఒవైసీ వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి. నిజమైన దోషులను గుర్తించి శిక్షించడమే బాధితులకు నిజమైన న్యాయం అవుతుందని ఒవైసీ తన వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా సూచించారు.

  Last Updated: 31 Jul 2025, 04:26 PM IST