Asaduddin Owaisi : అసదుద్దీన్‌ ఒవైసీ ఇంటిపై దాడి

ఇంటి నేమ్‌ ప్లేట్‌, గేటుపై నల్ల ఇంకు చల్లి ఆయన పేరు కనిపించకుండా చేశారు

  • Written By:
  • Publish Date - June 28, 2024 / 11:21 AM IST

ఎంఐఎం చీఫ్, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఇంటిపై దాడి (Attack) జరిగింది. ఢిల్లీ అశోక్‌ రోడ్డులోని ఆయన నివాసంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసారు. ఇంటి నేమ్‌ ప్లేట్‌, గేటుపై నల్ల ఇంకు చల్లి ఆయన పేరు కనిపించకుండా చేశారు. ఈ సంఘటన గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో కొన్ని పోస్టర్లను కూడా అతికించారు. అందులో ‘భారత్ మాతా కీ జై’ అని రాసి ఉంది. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఒవైసీ ఓ వీడియో పోస్ట్ తెలుపడం విశేషం.

We’re now on WhatsApp. Click to Join.

ఇలాంటి పిరికిపంద చర్యలకు తాను భయపడనని తేల్చి చెప్పారు ఒవైసీ. తన ఢిల్లీ నివాసాన్ని ఎన్నిసార్లు టార్గెట్ చేశారో ఇప్పటివరకు లెక్కేలేదని, ఇది ఎలా జరుగుతుందని ఢిల్లీ పోలీసు అధికారులను అడిగితే వారు నిస్సహాయత వ్యక్తం చేశారని ఒవైసి ఆరోపించారు. ఇది అమిత్ షా పర్యవేక్షణలో జరుగుతోందని ఆరోపించారు. ఓం బిర్లా దయచేసి ఎంపీల భద్రతకు ఏం హామీ ఇస్తారో చెప్పాలని కోరారు. ఇలాంటివి తనను భయపెట్టవని, పిరికి చర్యలను ఆపాలని వెల్లడించారు.

ఇక అంతకు ముందు లోక్‌సభలో ప్రమాణస్వీకారం సందర్భంగా అసదుద్దీన్‌ ‘జై పాలస్తీనా’ అనడం వివాదానికి దారితీసింది. భారత పార్లమెంట్‌ సాక్షిగా మరో దేశానికి ఓవైసీ విధేతయ చూపడంపై బీజేపీ నేతలతో పాటు పలువురు భగ్గుమంటున్నారు. దేశంలో ఉంటూ ఇక్కడే తిండి తింటూ పాలస్తీనాకు మద్దతు పలకడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు అసలు దేశంలో ఉండకూడదని మరికొంత మంది అంటున్నారు. ఇలా చేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఇంకొంత మంది చెబుతున్నారు. అంతేకాదు గతంలో కూడా ఒవైసీ భారతదేశం, భారతమాత పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Read Also : Kamal Hassan : కమల్ పారితోషికం పెంచడంపై ఇంట్రెస్టింగ్ న్యూస్..!