Site icon HashtagU Telugu

Pension System Rankings : ‘పెన్షన్ ఇండెక్స్’ లో ఇండియా ఎక్కడుందో తెలుసా ?

Pension System Rankings

Pension System Rankings

Pension System Rankings : ‘గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్’ విడుదలైంది. ఇందులో మన ఇండియాకు సంబంధించిన పలు ఆసక్తికర వివరాలను ప్రస్తావించారు. ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ప్రయోజనాలను అందించే విషయంలో ప్రపంచంలో అత్యుత్తమ దేశంగా నెదర్లాండ్స్ నిలిచింది. మొత్తం 100 పాయింట్లతో ఒక్కో దేశానికి ఇండెక్సింగ్ ఇవ్వగా.. ఇందులో నెదర్లాండ్స్ అత్యధికంగా  85  పాయింట్లను పొందింది. ఆ కంట్రీలో అమలవుతున్న అత్యుత్తమ పెన్షన్ విధానాల వల్లే నంబర్ 1 ర్యాంకు సాధ్యమైందని అమెరికాకు చెందిన మెర్సర్ CFA ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. ఈ సంస్థే  గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్’ ను రూపొందించి పబ్లిష్ చేసింది. ఈ లిస్టులో రెండో ర్యాంకులో ఉన్న ఐస్‌లాండ్ కు 83.5 పాయింట్లు, మూడో ర్యాంకులో ఉన్న డెన్మార్క్ కు 81.3 పాయింట్లు వచ్చాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఇక అర్జెంటీనాకు ప్రపంచంలోనే తక్కువగా 42.3 పాయింట్లు రావడం గమనార్హం.  అర్జెంటీనాకు చేరువగానే ఉన్న మన ఇండియాకు  45.9 పాయింట్లు వచ్చాయి. దీన్నిబట్టి భారతదేశ పెన్షన్ వ్యవస్థలో ఇంకా సంస్కరణలు అవసరం అని స్పష్టమైంది. ఉద్యోగులకు ప్రయోజనాలకు పెంచేలా.. పెన్షన్ సంబంధిత సేవలను మరింత సులభతరం చేసే దిశగా ఇంకా సంస్కరణలు జరగాల్సిన అవసరాన్ని ఈ నివేదిక నొక్కి చెప్పింది. 2022 సంవత్సరంలో భారత్ కు గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ లో 44.5 పాయింట్లు రాగా.. ఈసారి అవి స్వల్పంగా పెరిగి 45.9కు చేరాయి. పెన్షన్ వ్యవస్థ అమలు తీరుతెన్నుల ఆధారంగా..  ప్రపంచవ్యాప్తంగా మొత్తం 47 దేశాలకు ర్యాంకింగ్ ఇవ్వగా,   మన దేశానికి 45వ ర్యాంకు వచ్చింది. ఇక ఇదే సమయంలో చైనా, కొరియా, సింగపూర్, జపాన్‌  ర్యాంకింగ్స్ (Pension System Rankings) మెరుగయ్యాయి.

Also Read: TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్, బతుకమ్మ, దసరా సందర్భంగా TSRTC లక్కీ డ్రా!