Site icon HashtagU Telugu

Corona And Gold Smuggling: స్మగ్లర్లలో మార్పులు తీసుకొచ్చిన కరోనా

gold photo

gold photo

కరోనా అన్ని రంగాల్లో మార్పులను తీసుకొచ్చింది. చివరికి బంగారాన్ని స్మగ్లింగ్ చేసేవాళ్ళలో కూడా కరోనా పలు మార్పులు తీసుకువచ్చిందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నివేదిక తెల్పింది.

ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా, దానితో పాటే వచ్చిన లక్ డౌన్ తో ఒకదేశం నుండి మరోదేశానికి వెళ్లే విమానాలు, అంతర్ రాష్ట్ర రైల్వేలు పూర్తిగా రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో స్మగ్లర్లు దొంగబంగారాన్ని దేశంలోకి తీసుకొచ్చేందుకు రోడ్డు మార్గాన్నే బెస్ట్ అనుకున్నారట.

మయన్మార్ నుండి ఈశాన్య రాష్ట్రాల మీదుగా ఇండియాలోకి స్మగ్లింగ్ బంగారం వస్తున్నట్లు ఇప్పటికే చాలా ఆధారాలున్నాయని నిఘావర్గాలు తెలిపాయి. ఆసియా దేశాల నుండి మయన్మార్ మీదుగా ఇప్పటికే టన్నుల కొద్దీ బంగారాన్ని ఇండియాకి తీసుకొచ్చినట్లు సమాచారం.

డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజన్స్ విడుదల చేసిన స్మగ్లింగ్ ఇన్ ఇండియా 2020-21 రిపోర్ట్ ప్రకారం లాక్‌డౌన్‌లో ఎయిర్ పోర్ట్స్ మూసివేయడంతో స్మగ్లర్లు దొంగ బంగారాన్ని మధ్య, తూర్పు ఆసియా దేశాల నుంచి మయన్మార్ మీదుగా రోడ్డు మార్గంలో దేశానికి తరలించినట్లు తెలిపింది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ లాంటి నగరాలకు సరఫరా చేయడానికి స్మగ్లింగ్‌ గూడ్స్ తరలిస్తున్నవారిలో ఎక్కువగా
మయన్మార్ దేశస్తులు ఉన్నట్లు సమాచారం.

gold graph

భారత్ మయన్మార్ దేశాల మధ్య 1,643 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ దేశాల మధ్య ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌ లకు సరిహద్దులున్నాయి.

ఈ మార్గంలో తరలిస్తున్న బంగారంలో చాలా వరకు అధికారులు సీజ్ చేసినా స్మగ్లింగ్ చేస్తున్న బంగారంలో అది కేవలం తక్కువ మొత్తమేనని అధికారులు తెలిపారు.

Exit mobile version