Site icon HashtagU Telugu

AAP Releases 2nd List of Candidates: ఢిల్లీ ఎన్నికలు సమీపిస్తుండగా, అధికార ఆప్ తన రెండో అభ్యర్థుల జాబితా విడుదల..

Aap Releases 2nd List Of Candidates

Aap Releases 2nd List Of Candidates

AAP Releases 2nd List of Candidates: వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఇప్పటికే తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) తాజాగా తమ రెండో జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియా పేరు వెల్లడించారు. అయితే, సిసోదియా ఈసారి తన సాంప్రదాయ స్థానం అయిన పటపఢ్ గంజ్ నుంచి కాకుండా జంగ్‌పురా నుంచి పోటీ చేయనున్నారు. పటపఢ్ గంజ్ స్థానం నుంచి, ఇటీవల ఆప్‌లో చేరిన ప్రముఖ యూపీఎస్సీ కోచ్ అవధ్ ఓజా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.

మనీలాండరింగ్ కేసు, దిల్లీ మద్యం కుంభకోణం కేసులో 17 నెలలుగా తిహాడ్ జైలులో ఉన్న సిసోదియా ఆగస్టులో విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో, జైలులో ఉంటూ నిందల్ని ఎదుర్కొన్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ఒక ప్రకటనలో “ప్రజలు మళ్లీ తనకు విశ్వసనీయత సర్టిఫికెట్ ఇచ్చేవరకూ సీఎం పదవిలో ఉండబోను” అని వెల్లడించారు. ప్రస్తుతం, కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి రానున్న ఎన్నికల కోసం పార్టీని ముందుకి తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం, ఆప్ నాయకుడు ఆతిశీ దిల్లీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక, దిల్లీ మంత్రిగా పనిచేసిన కైలాశ్ గహ్లోత్ ఇటీవల భాజపాలో చేరిన విషయం కూడా అందరికి తెలిసిందే.