Site icon HashtagU Telugu

Prashant Kishor : రాష్ట్రాల పీసీసీల‌పై `పీకే` పెత్త‌నం?

prashant congress

prashant congress

సాధార‌ణ ఎన్నిక‌లు 2024 కంటే ముందుగా వ‌చ్చే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, గుజ‌రాత్ త‌దిత‌ర రాష్ట్రాల ప‌రిస్థితిపై ఏఐసీసీ త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతోంది. కానీ, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల గురించి కాంగ్రెస్ రాజ‌కీయ‌ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ఏ మాత్రం మాట్లాడ‌డంలేదు. సోనియా మాత్రం ఆయా రాష్ట్రాల ఎన్నిక‌ల విజ‌యంపై క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల వ్యూహాల వ‌ర‌కు సునీల్ క‌నుగోలుకు అప్ప‌గించార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ కార‌ణంగా పీకే వాటి గురించి స్పందించ‌డంలేద‌ని తెలుస్తోంది. కానీ, అంతర్గత కాంగ్రెస్ డైనమిక్స్ , వివిధ రాష్ట్ర పార్టీ విభాగాలలోని విభేదాలు 2024 సార్వత్రిక ఎన్నికల గెలుపుపై ఎంతో కొంత ప్ర‌భావం ఉంటుంది. పార్టీ వ్యవహారాల సారథ్యం గాంధీయేతర నాయకుడి డిమాండ్ పీకే చేరిక పై అంతర్గతంగా ముడిపడి ఉంది.

సోనియా గాంధీ ఎజెండాలో రాజస్థాన్ ప్రధానమైనది. ఇక్కడ పోటీదారు సచిన్ పైలట్ క్లెయిమ్ చేస్తున్నారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ‘చింతన్ శివిర్‌` ప్లాన్ చేసిన తర్వాత రాజస్థాన్ ప్రతిష్టంభనను త్వ‌ర‌లో తొల‌గించ‌వ‌చ్చ‌ని సమాచారం. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను ఎఐసిసి సెక్రటేరియట్ లోని ఉన్నత పదవిని చేపట్టమని కోరారా అనేది పెద్ద ప్రశ్న. అదే జ‌రిగితే, 70 ఏళ్ల మాంత్రికుడు దానిని ఇష్టపూర్వకంగా అంగీకరించే ఛాన్స్ త‌క్కువ‌. పైగా రాజీనామా లేఖ శాశ్వతంగా ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ వద్ద ఉందని ఇటీవ‌ల వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిని మార్చాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తే స్వేచ్ఛ‌గా నిర్ణ‌యం తీసుకోవ‌చ్చంటూ గెహ్లాట్ అన‌డం అంత‌ర్గ‌తంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

సోనియాగాంధీ, కాంగ్రెస్ అగ్రనేతల ముందు 2024 లోక్‌సభ ఎన్నికలకు, ముఖ్యంగా రాజస్థాన్ , మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలుపొందేందుకు అవసరమైన ప్రమాణాలపై పీకే వాదించారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ గెహ్లాట్ లేదా సచిన్ పైలట్ నాయకత్వంలో ఎక్కువ పార్లమెంటరీ స్థానాలను అందించడానికి మెరుగైన సన్నద్ధమైందా అనేది పెద్ద ప్రశ్న. రాజస్థాన్ ఇంచార్జ్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ సవివరమైన నివేదికను సమర్పించినట్లు సమాచారం. నవంబర్-డిసెంబర్ 2023 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించేందుకు తగిన వారితో కలిసి పని చేస్తానని పైలట్ సోనియా గాంధీకి గట్టి హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఏఐసీసీ సెక్రటేరియట్‌లో గాంధీయేతర నేత ఉన్నత పదవిలో ఉండాలని పీకే ఇచ్చిన సూచ‌న‌లో మరో కీలకాంశం. ఇది గెహ్లాట్ మరియు పైలట్ ఇద్దరినీ ఆలోచ‌న‌లో ప‌డేసింది. ఇదే స‌మ‌యంలో యాదృచ్ఛికంగా, జూన్ 2022లో రాజస్థాన్‌లో నాలుగు రాజ్యసభ బెర్త్‌లు రాబోతున్నాయి. కాంగ్రెస్‌కు మూడు సీట్లు దక్కే అవకాశం ఉంది. రాజస్థాన్ ప్రతిష్టంభనను అంతం చేయడంలో రాజ్యసభ నామినేషన్ కీలక పాత్ర పోషిస్తుంది.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 114 రోజుల ముందు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీని నియమించిన కాంగ్రెస్ ఘోరంగా పంజాబ్ ను న‌ష్ట‌పోయిన అంశం సోనియాగాంధీ మనసులో మెదులుతోంది. రాజస్థాన్‌లో మార్పు నిజంగా అవసరమైతే, రాష్ట్ర ఎన్నికలకు కనీసం ఒకటిన్నర సంవత్సరాల ముందు జరగాలని AICC చీఫ్ సూచ‌న‌లు అందుకుంద‌న‌ట‌. 2022 మే మధ్య మరియు జూన్ మధ్య కాలం రాజ‌స్తాన్ లోని మార్పుల‌కు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక హర్యానాకు సంబంధించి కొత్త రాష్ట్ర పార్టీ యూనిట్ చీఫ్ కోసం అన్వేషణ జరుగుతోంది. హర్యానా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత అధ్యక్షురాలు కుమారి సెల్జా ఇప్పటికే రాజీనామా చేశారు. ప్రస్తుతం హర్యానా అసెంబ్లీలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఉన్న అనుభవజ్ఞుడైన భూపేంద్ర సింగ్ హుడా ఆ ప‌ద‌విని ఆశిస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లో, రాష్ట్ర పార్టీ యూనిట్ చీఫ్ కమల్ నాథ్ ఆ రాష్ట్ర‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేయడానికి కూడా ప్రతిపాదించినట్లు సమాచారం. అనుభవజ్ఞుడైన నాథ్, 2023 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పార్టీని నడిపించేందుకు ఆసక్తిగా ఉన్నారని, తన జట్టులోని యువ నాయకులను తయారు చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. పక్కనే ఉన్న రాజస్థాన్ మాదిరిగానే, జూన్ 2022లో జరిగే రాజ్యసభ ఎన్నికలు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అంతర్గత విభేదాల‌కు తెర‌తీయ‌నున్నాయి. రెండేళ్ల క్రితం, కమల్ నాథ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజ్యసభ ఎన్నికలకు ముందు జరిగిన భీకర పోరులో జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు చేసి బీజేపీలోకి ఫిరాయించారు. ఈసారి అలాంటి పొర‌బాటు జ‌ర‌గ‌కుండా సోనియా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. కానీ, పీకే మాత్రం ఆయా రాష్ట్రాల్లోని మార్పుల‌పై మౌనంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.