Site icon HashtagU Telugu

Arvinder Singh Lovely : కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు లవ్లీ

Arvinder Singh Lovely

Arvinder Singh Lovely

లోక్ సభ ఎన్నికల (Lok Sabha) వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఢిల్లీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ (Arvinder Singh Lovely) తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ లో కాంగ్రెస్ ఆమ్​ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి రాసిన లేఖలో పేర్కొన్నారు. బాబారియాకు వ్యతిరేకంగా ఉన్న నాయకులను తొలగించాలని తనపై విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చాడు.. కానీ, నేను దానికి ఒప్పుకోకపోవడంతో విభేదాలు కొనసాగయాని అరవింద్ సింగ్ లవ్లి తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే, బాబరియా నిర్ణయాలు నచ్చకపోవడంతో చాలా మంది కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే విషయాన్ని అతను తన రాజీనామా లేఖలో రాశాడు. ఇక, గతంలో షీలా ప్రభుత్వంలో 12 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్న రాజ్‌కుమార్ చౌహాన్ టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ సీటు ఆశించిన రాజ్‌కుమార్ చౌహాన్‌కు టికెట్ రాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.

లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదని లేఖలో పేర్కొన్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుండగా మిగిలిన నాలుగు స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది. దీంతో ఈ పొత్తు ఢిల్లీ నేతలకు ఇష్టం లేదని లవ్లీ తన రాజీనామా లేఖలో తెలిపారు. పొత్తులో వచ్చిన 3 సీట్లలో 2 స్థానాల్లో స్థానికేతరులకు ఇవ్వడంతో అసంతృప్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Read Also : CSK Vs SRH: చెపాక్ వేదికగా చెన్నై, హైదరాబాద్ మధ్య భీకర పోరు