Site icon HashtagU Telugu

Kejriwal Wife: సీఎం కేజ్రీవాల్ ని కలిసేందుకు భార్యకు అనుమతి రద్దు

Kejriwal Wife

Kejriwal Wife

Kejriwal Wife: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిసేందుకు భార్య సునీతా కేజ్రీవాల్‌కు తీహార్ జైలు అనుమతిని రద్దు చేసింది. నిజానికి సునీత సోమవారం సీఎం కేజ్రీవాల్‌ను కలవాల్సి ఉంది. అయితే సునీతా కేజ్రీవాల్‌ భేటీని రద్దు చేసినందుకు గల కారణాలను తీహార్ జైలు అధికారులు ఇంకా వెల్లడించలేదు. మొత్తానికి సీఎం కేజ్రీవాల్ తో భేటీకి సిద్దమైన సునీతా కేజ్రీవాల్ కు తీహార్ అధికారులు పెద్ద షాకే ఇచ్చారు. జైలు నిబంధనల ప్రకారం ఒకేసారి ఇద్దరు వ్యక్తులు కేజ్రీవాల్‌ను జైలులో కలుసుకోవచ్చు. కాగా అపాయింట్‌మెంట్ సోమవారం మాత్రమే రద్దు చేయబడింది.

We’re now on WhatsAppClick to Join

ఆదివారం తిలక్ నగర్‌లోని మాల్‌ రోడ్డులో జరిగిన రోడ్‌ షోలో సునీతా కేజ్రీవాల్‌ పాల్గొన్నారు. పశ్చిమ ఢిల్లీ పార్లమెంటరీ నియోజకవర్గం ఆప్ అభ్యర్థి మహాబల్ మిశ్రా కూడా ఆయన వెంట ఉన్నారు. ఆమెకు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. రోడ్ షోలో కొంతమంది యువకులు బుల్ డోజర్ ముందు భాగాన్ని పైకి లేపి దానిపై కూర్చోవడం కనిపించింది. ఇది కాస్త వివాదానికి దారి తీసింది. ఇదిలా ఉండగా ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 21 సాయంత్రం 2 గంటల విచారణ తర్వాత సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం గమనార్హం. అప్పటి నుంచి అతడు కస్టడీలోనే ఉన్నాడు.

Also Read: Lok Sabha Elections 2024: 10-11 సీట్లు గెలిస్తే కేసీఆరే మళ్లీ తెలంగాణ సీఎం