Sunita Kejriwal: మూడు సార్లు సీఎంగా ఎన్నికైన వ్యక్తిని అధికార అహంకారంతో అరెస్ట్ చేశారు.. కేజ్రీవాల్ భార్య

  • Written By:
  • Publish Date - March 22, 2024 / 09:06 PM IST

 

 

Sunita Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi liquor scam case)లో ఈడీ(ED) అధికారులు గతరాత్రి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) ను అరెస్ట్ చేశారు. దీనిపై కేజ్రీవాల్ అర్ధాంగి సునీతా కేజ్రీవాల్(Sunita Kejriwal) ఘాటుగా స్పందించారు. ఆమె ప్రధాని మోడీ(PM Modi)ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ గారూ… మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తిని మీరు అధికార అహంకారంతో అరెస్ట్ చేశారు అని మండిపడ్డారు.

“మోడీ ప్రతి ఒక్కరినీ అణచివేయాలని చూస్తున్నారు. సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం ద్వారా ఢిల్లీ ప్రజలకు ద్రోహం తలపెట్టారు. ఢిల్లీ ప్రజలారా… మీ ముఖ్యమంత్రి ఎప్పుడూ మీ పక్షానే ఉంటారు. ఆయన బయట ఉన్నా, జైల్లో ఉన్నా ఆయన జీవితం ఎప్పుడూ దేశానికే అంకితం. ఆయన జనార్దనుడు (విష్ణువు, పరోపకారి) అని ప్రజలందరికీ తెలుసు” జై హింద్’ అని హిందీలో ట్వీట్‌ చేశారు.

read also: Lok Sabha Elections : భువనగిరి ఎంపీ టికెట్ పై కోమటిరెడ్డి క్లారిటీ..

కాగా, అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపరిచింది. మద్యం పాలసీ స్కామ్‌లో ఆయన కీలక కుట్రదారుడని ఆరోపించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22ను రూపొందించి అమలు చేసేందుకు ‘దక్షిణాది గ్రూప్‌’ నుంచి అనేక కోట్లు ముడుపులుగా స్వీకరించారని తెలిపింది. దీనిపై విచారణ కోసం అరవింద్‌ కేజ్రీవాల్‌ను పది రోజులు తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును ఈడీ కోరింది. అయితే ఈ నెల 28 వరకు ఆరు రోజులపాటు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది.