Site icon HashtagU Telugu

Arvind Kejriwal: క్షీణిస్తున్న కేజ్రీవాల్ ఆరోగ్యం

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోంది. డయాబెటిస్ ఉన్నందున, అతని షుగర్ స్థాయి హెచ్చుతగ్గులకు గురవుతుందని ఆప్ పేర్కొంది. అతని షుగర్ లెవెల్ 46కి పడిపోయింది. షుగర్ లెవెల్ ఇంత తగ్గడం చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. అంతకుముందు సీఎం కేజ్రీవాల్ గురించి ఆయన భార్య మాట్లాడారు. అరవింద్ జీ నిజమైన దేశభక్తుడు, నిర్భయుడు, ధైర్యవంతుడని అన్నారు. ఆయనకు దీర్ఘాయువు, ఆరోగ్యం మరియు విజయాన్ని అందించాలని కోరుకుంటున్నానని ఆమె చెప్పారు. కాగా కేజ్రీవాల్ ని కలిసినప్పుడు ఆయన చెప్పిన ఓ మాటను ఆమె పంచుకున్నారు. నా శరీరం జైలులో ఉందని, అయితే నా ఆత్మ మీ అందరి మధ్య ఉందని కేజ్రీవాల్ చెప్పినట్టు ఆయన భార్య పేర్కొన్నారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది. అనంతరం కోర్టులో హాజరుపరచగా విచారించిన అనంతరం మార్చి 28 వరకు ఈడీ రిమాండ్‌కు తరలించారు. కాగా మార్చి 28న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరచనున్నారు.

Also Read: Babar Azam: మ‌రోసారి పాకిస్థాన్ జ‌ట్టు కెప్టెన్‌గా బాబ‌ర్ ఆజ‌మ్‌..?