Kejriwal: సుప్రీంకోర్టులో పిటిషన్​ వెనక్కి తీసుకున్న కేజ్రీవాల్‌

  • Written By:
  • Publish Date - March 22, 2024 / 01:12 PM IST

 

Kejriwal ED Arrest : ఈడీ (Enforcement Directorate) అరెస్టుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు(Supreme Court)లో దాఖలు చేసిన పిటిషన్(Petition)​ను కేజ్రీవాల్(Kejriwal)​ వెనక్కు తీసుకున్నారు. రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court)లో రిమాండ్ పిటిషన్‌(Remand Petition)పై విచారణ దృష్ట్యా వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తన వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కేజ్రీవాల్​ తరఫున న్యాయవాది మను సింఘ్వి, జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనానికి తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు లో ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు గురువారం రాత్రి అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్‌ అనంతరం రామ్‌ మనోహర్‌ లోహియా వైద్యుల బృందం కేజ్రీవాల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం దేశ రాజధానిలోని ఈడీ కార్యాలయానికి ఆయన్ని తరలించారు. అయితే కేజ్రీవాల్‌ను రాత్రంతా ఈడీ కార్యాలయంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న లాకప్‌లో ఉంచినట్లు తెలిసింది.

read also: Sree Vishnu: ఆ హీరోయిన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో శ్రీ విష్ణు?

అంతకముందు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను అరెస్ట్ చేయడాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను ప్రత్యేక బెంచ్ కు సీజేఐ చంద్రచూడ్ కేటాయించారు.