Site icon HashtagU Telugu

Manish Sisodia Interview : నా అరెస్టు వెనుక ఏదో రాజకీయ కారణం.. ఇంటర్వ్యూలో మనీశ్ సిసోడియా కీలక వ్యాఖ్యలు

Manish Sisodia Released Fro

Manish Sisodia Interview : జాతీయ మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఢిల్లీ డిప్యూటీ సీఎంగా తిరిగి బాధ్యతలు చేపడతారా ?’ అని అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ..  ‘‘అలా చేయొచ్చు. కానీ ఈ విషయంలో నేను తొందరపడను. ప్రస్తుతం అందరినీ కలవడంలో బిజీగా ఉన్నాను’’ అని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పని చేయడం గర్వంగా ఉందన్నారు. పరిపాలనలో భాగం కావడానికి తొందరపడటం లేదని చెప్పారు. ‘‘నేను జైలు నుంచి బయటికొచ్చి నాలుగు రోజులైంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ త్వరలోనే తిరిగొస్తారు. ఆయన వచ్చాక నేను పార్టీ ప్రమోషన్‌లో ఉండాలా ? లేదా ?  ప్రభుత్వంలో ఉండాలా ? అనేది ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నాయకత్వం నిర్ణయిస్తుంది’’ అని  సిసోడియా(Manish Sisodia Interview) చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో  అరెస్టయ్యాక 17 నెలల పాటు జైలులోనే ఉండాల్సి వస్తుందని తాను భావించలేదని మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. అసలు అరెస్టు అవుతానని కూడా తాను భావించలేదన్నారు. తనను జైలులో ఉంచేందుకు మద్యం పాలసీ కేసు రూపంలో బీజేపీ కల్పిత కుంభకోణం చేసిందని ఆరోపించారు. తన అరెస్టు వెనుక ఏదో రాజకీయ కారణం ఉందనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘‘క్రియాశీల రాజకీయాల్లోకి ఎవరైనా రావాలని భావిస్తే రెడ్ కార్పెట్ పరిచి స్వాగతిస్తారని అనుకోవద్దు. ఆవిషయాన్ని అర్థం చేసుకున్నాకే నేను మానసికంగా సిద్ధమయ్యా’’ అని సిసోడియా తెలిపారు.

Also Read :Coffee Day : కాఫీ డేకు భారీ ఊరట.. దివాలా చర్యలను ఆపాలంటూ ఆదేశాలు

‘‘పీఎంఎల్ చట్టం కింద ఈడీ, సీబీఐ కలిసి నాపై  కేసులు బనాయించాయి. ఉగ్రవాదులు, డ్రగ్స్ మాఫియాలకు నిధులు సమకూర్చకుండా ఆపేందుకు సంబంధించిన చట్టాల సెక్షన్లతో నాపై కేసులు బనాయించారు. వాటిలో బెయిల్ సాధించడం కష్టం. అందుకే నన్ను చాలా కాలం జైలులో ఉంచగలిగారు’’ అని మనీశ్ సిసోడియా తెలిపారు. ‘‘ముఖ్యంగా నా భార్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు నేను జైలులో ఉండటంతో నా కుటుంబం ఇబ్బందులు పడింది. ఆసమయంతో నేను జైలులో ఉన్నా కుంగిపోలేదు. బలంగా పోరాడాలని నిర్ణయించుకున్నాను. రోజులో  దాదాపు 15 నుంచి 16 గంటలు ఏకాంతంగా ఉండాల్సి వచ్చేది. మాట్లాడేందుకూ ఎవరూ కనిపించేవారు కాదు. అందుకే నాతో నేనే స్నేహం చేసుకున్నాను’’ అని మనీశ్ సిసోడియా వివరించారు.

Also Read :Rajnath Singh : జమ్మూకశ్మీర్‌ భద్రతా..పరిస్థితులపై రాజ్‌నాథ్ సింగ్ కీలక భేటి