Arvind Kejriwal : తనను జైల్లో వేయడం వల్ల తన కరేజ్​ 100 రెట్లు పెరిగింది – కేజ్రీవాల్

Arvind Kejriwal : జీవితంలో ఎన్నో పోరాటాలు, కష్టాలు ఎదుర్కొన్నా. కానీ సత్యమార్గంలోనే నడిచాను. అందుకే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నన్ను జైలులో పెట్టి మనో ధైర్యాన్ని దెబ్బతీద్దామని కొందరు అనుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Arvind Kejriwal Walks Out O

Arvind Kejriwal Walks Out O

Arvind Kejriwal walks out of jail with ‘courage, morale increased 100 times’ : ఢిల్లీ లిక్కర్ కేసులో(Delhi Liquor Scam) 5 నెలలుగా జైల్లో గడిపిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)..ఎట్టకేలకు బెయిల్ (Arvind Kejriwal Bail) ఫై శుక్రవారం బయటకు వచ్చారు. కేజ్రీవాల్‌ విడుదల కావడం తో ఆ పార్టీ నేతలు , శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. జైలు నుండి విడుదలైన కేజ్రీవాల్‌ కు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా కేజ్రీవాల్ (Kejriwal ) మాట్లాడారు. తాను రిలీజ్​ కావాలని కోరుకున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నా జీవితం దేశానికే అంకితం. జీవితంలో ఎన్నో పోరాటాలు, కష్టాలు ఎదుర్కొన్నా. కానీ సత్యమార్గంలోనే నడిచాను. అందుకే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నన్ను జైలులో పెట్టి మనో ధైర్యాన్ని దెబ్బతీద్దామని కొందరు అనుకున్నారు. నేను జైలు నుంచి బయటకు వచ్చాక నా ధైర్యం 100 రెట్లు పెరిగింది. భగవంతుడు చూపిన మార్గంలోనే నడుస్తూ, దేశానికి సేవ చేస్తూనే ఉంటాను. దేశాన్ని విభజించేందుకు ప్రయత్నించే శక్తులపై పోరాటం కొనసాగిస్తాను” అని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌కు ఉదయం సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10లక్షల బాండ్ సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ కేసుపై మాట్లాడొద్దని సుప్రీంకోర్టు సూచించింది. ట్రయల్ కోర్టు విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలు జారీ చేసింది. ఈడీ బెయిల్ షరతులే వర్తిస్తాయని సుప్రీంకోర్టు తెలిపింది. సీఎం ఆఫీసు, సెక్రటేరియట్‌కు వెళ్లరాదని ఈడీ బెయిల్‌లో ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇక కేజ్రీవాల్‌కు బెయిల్ రావడం ఫై కాంగ్రెస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేజ్రీవాల్‌కు కేవలం బెయిల్‌ మాత్రమే వచ్చిందని , సుప్రీం కోర్టు ఆయనకు క్లీన్‌ చిట్‌ ఇవ్వలేదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అశోక్‌ శర్మ వ్యాఖ్యానించారు.

Read Also : Flood Damage : తెలంగాణ లో వరద నష్టం రూ.10,320 కోట్లు – కేంద్రానికి తెలిపిన రేవంత్

  Last Updated: 13 Sep 2024, 10:11 PM IST