AAP : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుత రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను లుధియానా వెస్ట్ అసెంబ్లీ నుంచి బరిలోకి దించారు. దీంతో ఎంపీ స్థానం ఖాళీ కావడంతో కేజ్రీవాల్ దాన్ని భర్తీ చేయొచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను పార్టీ తోసిపుచ్చింది. అవన్నీ వదంతులేనని ఆప్ పంజాబ్ విభాగ అధికార ప్రతినిధి జగ్తర్‌సింగ్ వెల్లడించారు. కేజ్రీవాల్‌ను రాజ్యసభకు పంపించే అంశంపై ఏ చర్చ జరగలేదని స్పష్టంచేశారు. ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా ఈ ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
Read Also: Pooja Hegde : డీగ్లామరస్ రోల్ పూజా హగ్దే..?
ఈ విషయంపై ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంకా కక్కర్ మాట్లాడుతూ.. కేజ్రీవాల్ రాజ్యసభ సభ్యుడి గా పార్లమెంటుకు వెళ్లనున్నారని జరుగుతున్న ప్రచారాన్నికొట్టిపారేసింది. అర్వింద్ కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్లడం లేదని, అవన్నీ ఆధారంలేని ఊహాగానాలని ఇదంతా మీడియా చేస్తున్న అసత్య ప్రచారమని ఆమె తోసిపుచ్చారు. ఇంతకుముందు కూడా కేజ్రీవాల్‌పై మీడియాలో ఇలాంటి ఊహాగానాలే కొనసాగాయని, ఆయన పంజాబ్ ముఖ్యమంత్రి కాబోతున్నారనే ప్రచారం జరిగిందని కక్కర్ గుర్తుచేశారు. ఇప్పుడు రాజ్యసభకు వెళ్తున్నారనే ప్రచారం జరుగుతోందని, ఇది కూడా మీడియా చేస్తున్న ఉత్త ప్రచారమేనని ఆమె కొట్టిపారేశారు.
కాగా, ప్రస్తుతం రాజ్యసభ లో ఉన్న ఆప్ ఎంపీ సంజీవ్ అరోరాను పార్టీ పంజాబ్ ఉప ఎన్నికల బరిలో నిలబెట్టింది. త్వరలో జరగబోయే లూథియానా వెస్ట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అభ్యర్థిగా సంజీవ్ పేరును ఖరారు చేస్తూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో కేజ్రీవాల్ పార్లమెంట్ ఎంట్రీపై వార్తలు తెరపైకి వచ్చాయి. సంజీవ్ అరోఢా 2022లో పంజాబ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2028లో ముగియనుంది. కాగా.. లూథియానా వెస్ట్ నుంచి ఎన్నికైన ఆప్ ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ గోగి గత నెల మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో పార్టీ సంజీవ్‌ను బరిలోకి దించింది.
Read Also: Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీపై మరో రెండు కేసులు !