Kejriwal : 14 రోజుల జ్యుడిషయల్‌ కస్టడీ.. తీహార్‌ జైలుకు కేజ్రీవాల్‌

  • Written By:
  • Updated On - April 1, 2024 / 01:22 PM IST

 

Arvind Kejriwal: మద్యం పాలసీ కేసు (Delhi Excise policy case)లో ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు కోర్టు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. లిక్కర్‌స్కామ్‌లో 15 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీ (judicial custody) విధిస్తూ సోమవారం ఉదయం తీర్పు వెలువరించింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ కేసులో మార్చి 22న కేజ్రీవాల్‌ను అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రౌస్ అవెన్యూ కోర్టు (Delhis Rouse Avenue court) ఆయనకు వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఆ గడువు మార్చి 28న ముగియడంతో కోర్టులో హాజరుపరుచగా ఢిల్లీ సీఎంకు మరో మూడు రోజులు కస్టడీ విధించింది. కోర్టు విధించి ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో అధికారులు ఆయన్ని ఇవాళ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. భారీ భ‌ద్రత మ‌ధ్య ఆయ‌న్ను కోర్టుకు తీసుకువ‌చ్చారు.

Read Also: Mahesh Babu : అమెరికాలో కుర్చీ మడతపెట్టి సాంగ్ క్రేజ్.. వీడియో వైరల్..

స్పెష‌ల్ జ‌డ్జి కావేరి బ‌వేజా ముందు ఆయ‌న్ను ప్రొడ్యూస్ చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌కు కోర్టు రిమాండ్‌ విధించింది. ఏప్రిల్‌ 15 వరకూ జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధిస్తూ తీర్పు వెలువరించింది. ఢిల్లీ సీఎంను తీహార్‌ జైలుకు పంపాలని ఆదేశించింది. కోర్టుకు తీసుకువ‌స్తున్న స‌మ‌యంలో రిపోర్టర్లు కేజ్రీని ప్రశ్నించారు. ప్రధాని మోడీ చేస్తోంది దేశానికి మంచిది కాదు అని కేజ్రీవాల్ ఈ సందర్భంగా అన్నారు. అయితే, తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్ పిటిషన్‌ మంగళవారం విచారణకు రానుంది.

అయితే ఇవాళ అర‌వింద్ కేజ్రీవాల్ న్యాయ‌వాదులు కోర్టులో ప్ర‌త్యేక అప్లికేష‌న్ దాఖ‌లు చేశారు. మూడు పుస్త‌కాలు చ‌దువుకునేందుకు కేజ్రీవాల్‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని న్యాయ‌వాదులు కోరారు. భ‌గ‌వ‌ద్గీత, రామాయ‌ణం, హౌ ప్రైమ్ మినిస్ట‌ర్స్ డిసైడ్ అన్న పుస్త‌కాలు కేజ్రీవాల్ చ‌దువుకుంటార‌ని ఆయ‌న త‌ర‌పున న్యాయ‌వాదులు కోర్టులో తెలిపారు. ప్ర‌స్తుతం జుడిషియ‌ల్ రిమాండ్‌కు వెళ్లిన కేజ్రీవాల్ మ‌రో 15 రోజుల పాటు జైల్లోనే ఉండ‌నున్నారు. ఆ స‌మ‌యంలో బ‌హుశా ఆయ‌న ఈ పుస్త‌కాలు చ‌దువుతారో ఏమో అన్న డౌట్స్ వ్య‌క్తం అవుతున్నాయి. మ‌ద్యం పాల‌సీ కేసుతో లింకున్న మ‌నీల్యాండ‌రింగ్ కేసులో కేజ్రీవాల్ ప్ర‌ధాన నిందితుడు అని ఈడీ ఆరోపిస్తున్న‌ది. ఆయ‌న్ను మార్చి 21వ తేదీన అరెస్టు చేశారు. హౌ ప్రైమ్‌మినిస్ట‌ర్స్ డిసైడ్ అన్న పుస్త‌కాన్ని జ‌ర్న‌లిస్టు నీర‌జ్ చౌద‌రీ రాశారు. ప్ర‌ధానులు ఎలా కీల‌క‌మైన నిర్ణ‌యాల‌ను తీసుకున్నారో ఆ పుస్త‌కంలో ఆయ‌న విశిద‌ప‌రిచారు.