అమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన సతీమణి సునీత, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు కేజ్రీవాల్ కు ఘనంగా స్వాగతం పలికారు.
బుధవారం సాయంత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో రేణిగుంట ఎయిర్ పోర్టుకు వచ్చిన ఆయనను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మరియు కార్యకర్తలు ఘనంగా స్వాగతించారు. ఆ తర్వాత, రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్న కేజ్రీవాల్ కుటుంబంతో కలిసి బుధవారం రాత్రి తిరుమలలో బస చేసారు. గురువారం ఉదయం, ఆయన మరియు కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్శన, అరవింద్ కేజ్రీవాల్ కు తిరుమలలో జరిగే మొదటి దర్శనం కావడం విశేషం.
తిరుమల శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ #arvindkejriwal #tirupatibalaji #tirumala #aap #HashtagU pic.twitter.com/srpp3Gchor
— Hashtag U (@HashtaguIn) November 14, 2024