Site icon HashtagU Telugu

Kejriwal : నేటితో ముగియనున్న ఈడీ కస్టడీ.. నేడు కోర్టుకు కేజ్రీవాల్‌

Arvind Kejriwal

CM Arvind Kejriwal judicial custody extended till April 23

Arvind Kejriwal: ఢిల్లీ మద్యం పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈడీ కస్టడీ(ED Custody) నేటితో ముగియనుంది. దీంతో ఈడీ అధికారులు ఆయనను రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court)లో హాజరు పర్చనున్నారు. అయితే మరోసారి తమ కస్టడీకి ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తున్నది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, మార్చి 22న కేజ్రీవాల్‌ను అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఆ గడువు మార్చి 28న ముగియడంతో కోర్టులో హాజరుపరుచగా ఢిల్లీ సీఎంకు మరో మూడు రోజులు కస్టడీ విధించింది. నేటితో అది ముగుస్తుండటంతో ఆయన కస్టడీని కోర్టు మరోసారి పొడిగిస్తుందా లేక జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలిస్తుందా అనే అంశంపై ఆసక్తి నెలకొన్నది. అయితే, తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్ పిటిషన్‌ మంగళవారం విచారణకు రానుంది.

Read Also: Delhi Liquor Case : కవిత కు.. బెయిలా? కస్టడీ పొడిగింపా?

మరోవైపు, ఈడీ కస్టడీ నుంచి దేశ ప్రజలకోసం ఆరు గ్యారెంటీలు కేజ్రీవాల్ ప్రకటించాడని సునీతా కేజ్రీవాల్ అన్నారు. అవేమిటంటే.. దేశవ్యాప్తంగా 24 గంటలపాటు కరెంట్. ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలు, ఉచిత విద్య కల్పిస్తాం. ప్రతి గ్రామంలో మోహల్లా క్లినిక్స్, జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తాం. రైతులకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా పంటలకు మద్దతు ధర కల్పిస్తాం. ఢిల్లీకి రాష్ట్ర హోదా, పూర్తి అధికారాలు కల్పిస్తామని కేజ్రీవాల్ తన సందేశంలో పేర్కొన్నారు. అయితే, ఇండియా కూటమి నేతలను కేజ్రీవాల్ క్షమించమని కోరారు.. ఎందుకంటే.. నేను జైల్లో ఉన్నాను కాబట్టి మిమ్మల్ని అడగకుండా హామీల ప్రకటన చేస్తున్నాని కేజ్రీవాల్ తన సందేశంలో పేర్కొన్నారు.