Arvind Kejriwal: ఈడీ కస్టడీ నుంచి సీఎం కేజ్రీవాల్ తొలి ఉత్తర్వు

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉండగానే తొలి ఉత్తర్వును జారీ చేశారు. ఈ ఉత్తర్వు జల మంత్రిత్వ శాఖకు సంబంధించినదని.

Published By: HashtagU Telugu Desk
Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉండగానే తొలి ఉత్తర్వును జారీ చేశారు. ఈ ఉత్తర్వు జల మంత్రిత్వ శాఖకు సంబంధించినదని.

ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో గత గురువారం అరెస్టయిన సంగతి తెలిసిందే.ఆయన అధికారిక నివాసంలో రెండు గంటలపాటు సోదాలు చేసిన తర్వాత మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మార్చి 21న ఈడీ కేజ్రీవాల్ ను అదుపులోకి తీసుకుంది. అయితే కోర్టులో హాజరుపరచగా శుక్రవారం మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అనుమతినిచ్చింది. అయితే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయినప్పటి నుండి కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని మరియు అవసరమైతే ప్రభుత్వాన్ని జైలు నుండి నడిపిస్తారని ఆయన పార్టీ నాయకులు చెప్తూ వస్తున్నారు.

మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆదివారం ఢిల్లీలో నిరసనకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భద్రతా ఏర్పాట్లను పెంచారు.

Also Read: Holi 2024 Weather:హోలీ రోజు వ‌ర్షం పడుతుందా..? వాతావ‌ర‌ణ శాఖ ఏం చెప్పిందంటే..?

  Last Updated: 24 Mar 2024, 10:43 AM IST