Site icon HashtagU Telugu

Arvind Kejriwal Bail: కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు

Arvind Kejriwal Bail

Arvind Kejriwal Bail

Arvind Kejriwal Bail: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆయనకు మధ్యంతర బెయిల్‌‌ మంజూరు చేసింది. దీంతో ఆప్ వర్గాల్లో సంతోషం వెల్లువిరుస్తుంది. దాదాపు నెలన్నర తర్వాత కేజ్రీవాల్ కు బెయిల్ లభించడం విశేషం.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రిని ఈడీ అరెస్టు చేయడాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఎన్నికల ప్రచారాన్ని దృష్టిలో ఉంచుకుని కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసే అంశాన్ని పరిశీలించవచ్చని ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు పేర్కొంది. దీంతో నేడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌కు ఊరటనిస్తూ జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్ట్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. కాగా జూన్ 2వ తేదీన తిరిగి లొంగిపోవాలని కేజ్రీవాల్‌ను ఆదేశించింది సుప్రీంకోర్టు.

అయితే వాదనలో భాగంగా జూన్ 4వ తేదీ వరకు సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది సుప్రీం కోర్టును కోరగా.. ఆ అభ్యర్థనను సుప్రీంకోర్టు తీరస్కరించిందిమద్యం కేసులో మార్చి 21న ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది.

Also Read: Arvind Kejriwal Bail: కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు