Assembly elections : ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు సంబంధించి ఈ నెల 10న నోటిఫికేషన్ విడుదల కాగా.. 17వ తేదీ వరకు నామినేషన్‌లకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ న్యూ ఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి కన్నౌట్ ప్రాంతంలోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు.
అనంతరం రిటర్నింగ్ ఆఫీస్‌కు ర్యాలీగా వెళ్లి.. అక్కడ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్‌కు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఇక ఇప్పటికే కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఢిల్లీ సీఎం అతిశీ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు. కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేయగా, బీజేపీకి చెందిన పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్‌తో తలపడనున్నారు.
కాగా, ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను విచారించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు అనుమతి మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది మార్చిలో కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన తర్వాత ED ఆయనపై ప్రత్యేక మనీలాండరింగ్ చట్టం (పిఎంఎల్‌ఎ) కోర్టు ముందు ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేజ్రీవాల్‌ను విచారించేందుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) ఇటీవలే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)కి అవసరమైన అనుమతిని మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు.
Read Also: KTR To ED: రేపు ఈడీ విచారణకు కేటీఆర్