Site icon HashtagU Telugu

Kejriwal Bail LIVE: కాసేపట్లో కేజ్రీవాల్ విడుదల, తీహార్ జైలుకు సునీత కేజ్రీవాల్

Kejriwal Bail LIVE

Kejriwal Bail LIVE

Kejriwal Bail LIVE: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ (Aravind Kejriwal)కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైలు నుంచి బయటకు వచ్చేందుకు మార్గం కూడా సుగమమైంది. సమాచారం ప్రకారం కేజ్రీవాల్ గేట్ నంబర్ 3 నుండి బయటకు రావచ్చు. కేజ్రీవాల్ భార్య సునీత కూడా తీహార్(Tihar Jail) చేరుకున్నారు. కాసేపట్లో సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి బయటకు వస్తారు.

మద్యం కుంభకోణం కేసులో జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్156 రోజుల తర్వాత కోర్టు అతడిని విడుదల చేసింది. ఇవాళ ఢిల్లీ సీఎంకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్ బెయిల్ మంజూరు చేశారు. కాగా సీఎం కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్(Sunita Kejriwal) తీహార్ వెలుపల ఉన్నారు. సీఎం కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు రాగానే చంద్గీ రామ్ అఖారాకు చేరుకుంటారు. ఇక్కడి నుంచి రోడ్‌షో ద్వారా వెళ్తారు.అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చినప్పటి నుంచి ఆప్ కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆప్ నేతలు దీనిని విజయంగా అభివర్ణించారు. మనీష్ సిసోడియా, సునీతా కేజ్రీవాల్ మిఠాయిలు పంచి ఆనందం వ్యక్తం చేశారు.

మార్చి 21న ఈడీ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. 10 రోజుల విచారణ అనంతరం ఏప్రిల్ 1న తీహార్ జైలుకు తరలించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం మే 10న కోర్టు ఆయనను 21 రోజుల పాటు విడుదల చేసింది. 51 రోజుల పాటు జైలులో ఉన్న ఆయనకు బెయిల్ మంజూరైంది. జూన్ 1వ తేదీ వరకు కేజ్రీవాల్ జైలుకు దూరంగా ఉన్నారు. జూన్ 2న తిరిగి తీహార్ జైలులో లొంగిపోయాడు. విడుదలైన 21 రోజులతో కలిపి మొత్తం 177 రోజుల తర్వాత కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు రానున్నారు. 21 రోజుల విడుదలను తొలగిస్తే, కేజ్రీవాల్ 156 రోజులు జైలులో ఉన్నారు.

Also Read: CM Revanth Reddy : ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్ జెండర్స్ : అధికారులకు సీఎం ఆదేశాలు