Site icon HashtagU Telugu

Arunachal Pradesh : భార‌త్ భూభాగంలోని 11 ప్రాంతాల్లోకి చైనా

Arunachal

Arunachal

భార‌త భూభాగంలోని అరుణాచ‌ల ప్ర‌దేశ్ (Arunachal Pradesh) 11 ప్రాంతాల్లో చైనా (China) కొత్త పేర్ల‌ను పెట్టింది. గ‌తంలో రెండుసార్లు కొన్ని ప్రాంతాల పేర్ల‌ను ప్ర‌ద‌ర్శించింది. మూడోసారి మ‌రికొన్ని ప్రాంతాల‌కు నామ‌క‌ర‌ణం చేస్తూ చైనా బ్యాన‌ర్ల‌ను ప్ర‌ద‌ర్శించింది. అరుణాచల్ ప్రదేశ్ లోని ఆ ప్రాంతాల‌కు చైనీస్, టిబెటన్ మరియు పిన్యిన్ అక్షరాలలో పేర్లను చైనా విడుదల చేసింది.అధికారిక చైనా మంత్రిత్వ శాఖ ఆ పేర్ల‌ను విడుదల చేసింది. రెండు భూభాగాలు, రెండు నివాస ప్రాంతాలు, ఐదు పర్వత శిఖరాలు, రెండు నదులతో సహా ఖచ్చితమైన ప్ర‌దేశాల‌కు పేర్ల‌ను పెట్టింది. దేశం స్థలాల పేర్లు, వాటి అధీనంలోని అడ్మినిస్ట్రేటివ్ జిల్లాల వర్గాన్ని ప్ర‌క‌టించింది. అరుణాచల్ ప్రదేశ్‌కు సంబంధించిన ప్రామాణిక భౌగోళిక పేర్ల మూడవ జాబితాను చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్ల‌డించ‌డం స‌రిహ‌ద్దుల్లో మ‌రోసారి టెన్ష‌న్ పెంచుతోంది.

భార‌త భూభాగంలోని అరుణాచ‌ల ప్ర‌దేశ్ (Arunachal Pradesh) 11 ప్రాంతాల్లో చైనా..

దలైలామా అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) సందర్శన తర్వాత 2017లో అరుణాచల్‌లోని ఆరు ప్రదేశాల ప్రామాణిక పేర్ల మొదటి జాబితాను విడుదల చేసింది. టిబెట్ ఆధ్యాత్మిక గురువు పర్యటనపై చైనా తీవ్ర విమర్శలు చేసింది. దలైలామా టిబెట్ నుండి అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ గుండా పారిపోయారు. 1950లో హిమాలయ ప్రాంతాన్ని చైనా సైనిక ఆధీనంలోకి తీసుకున్న తర్వాత 1959లో భారతదేశంలో ఆశ్రయం పొందారు. అప్పుడు 15 స్థానాలతో కూడిన రెండవ జాబితాను 2021లో చైనా ప్ర‌క‌టించింది. చైనా క్యాబినెట్ స్టేట్ కౌన్సిల్ జారీ చేసిన భౌగోళిక పేర్లపై నిబంధనలకు అనుగుణంగా అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా ఇప్పటికే ‘టిబెట్ దక్షిణ భాగం జంగ్నాన్’ అని పిలుస్తుంది.

అరుణాచల్ ప్రదేశ్‌ లోని కొన్ని ప్రాంతాల పేర్లను చైనా మార్చ‌డాన్ని..

ఇలాంటి ప‌రిణామాలు భారతదేశం, చైనా (China)ల మధ్య సంబంధాలు నిరంతర గందరగోళానికి సాక్ష్యమిస్తున్నాయి, ప్ర‌ధానంగా జూన్ 2020లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ ఇరు దేశాల మ‌ధ్య సంబంధాల‌కు కొంత ఆట‌కం క‌లిగించాయి. 1975 తర్వాత ఇరుపక్షాల మధ్య జరిగిన మొదటి ఘర్షణగా గాల్వాన్ సంఘ‌ట‌న ఉంది. జనవరి 2021లో సిక్కిం సమీపంలో జరిగిన మరో ఘ‌ర్ష‌ణ ఇరు వైపులా సైనికులు గాయపడ్డారు. అనేక రౌండ్ల సైనిక స్థాయి చర్చల తర్వాత కూడా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 2022లో, అరుణాచల్ ప్రదేశ్‌ (Arunachal Pradesh) లోని తవాంగ్ సెక్టార్ సమీపంలో ఏడాది త‌రువాత మొదటిసారిగా సైనికులు ఘర్షణ పడ్డారు.

బీజింగ్ ‘రెచ్చగొట్టేవిగా చ‌ర్య‌లు ఉన్నాయని..

తూర్పు లడఖ్ సరిహద్దుకు సైనిక బలగాలను తీసుకురాకూడదనే ఒప్పందాలను బీజింగ్ అనేక సందర్భాల్లో ఉల్లంఘించింది. ఇటీవల‌ హిమాలయాలలో సరిహద్దులోని కొన్ని భాగాలలో భారతదేశం, చైనా సైనికులు ఘర్షణ పడ్డారు. గత ఏడాది డిసెంబరులో అరుణాచల్ ప్రదేశ్‌ (Arunachal Pradesh) లోని తవాంగ్ సెక్టార్‌లో సైన్యం మధ్య చిన్నపాటి గొడవలు జరిగాయి. తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల పేర్లను చైనా మార్చ‌డాన్ని భారత్ తోసిపుచ్చింది. చైనా పేర్ల‌ను మార్పు చేసిన‌ప్ప‌టికీ భారతదేశంలో అంతర్భాగంగా ఆ ప్రాంతాలు ఉంటాయ‌ని చెబుతోంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ, “చైనా ఇలాంటి ప్రయత్నం చేయడం ఇదే మొదటిసారి కాదని తేలిగ్గా కొట్టిపారేశారు.

అరుణ చ‌ల్ ప్ర‌దేశ్ (Arunachal Pradesh) లోని కొన్ని ప్రాంతాల‌కు పేర్ల ప్రకటన చట్టబద్ధమైన చర్యగా గ్లోబ‌ల్ టైమ్స్ చెబుతోంది. భౌగోళిక పేర్లను ప్రామాణీకరించడానికి చైనా సార్వభౌమ హక్కు అని చైనా నిపుణులను ఉటంకిస్తూ పేర్కొంది. భారత సరిహద్దులపై చైనా అభివృద్ధిని తెలుపుతూ బీజింగ్ ‘రెచ్చగొట్టేవిగా చ‌ర్య‌లు ఉన్నాయని ఈఏడాది మార్చి 30న వైట్‌హౌస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంట యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చడానికి చైనా (China) ప్రయత్నిస్తుందని పేర్కొంది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి మరియు ప్రశాంతతను తీవ్రంగా దెబ్బతీసిందని గ‌త ఏడాది పేర్కొంది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ సంబంధాలలో సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి సరిహద్దులో శాంతి, ప్రశాంతతను పునరుద్ధరించడం అవసరమ‌ని గ‌త ఏడాది వార్షిక నివేదిక‌లో అన్నారు.

Also Read : US Sanctions On China: చైనాపై మరోసారి అమెరికా ఆంక్షలు..?