Site icon HashtagU Telugu

Article 370 : సుప్రీం కోర్టు తీర్పు ఫై పవన్ కళ్యాణ్ హర్షం

Pawan Article 370

Pawan Article 370

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఉపసంహరిస్తూ 2019లో కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్‌ (Article 370)ను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు (సోమవారం) సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జమ్మూ కశ్మీర్ (Jammu kashmir) కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడంపై జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ (Justice DY Chandrachud) నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ అంశంపై తీర్పు వెలువరించింది.

ఈ తీర్పు ఫై భిన్నప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది ఈ తీర్పు ఫై హర్షం వ్యక్తం చేస్తుండగా..మరికొంతమంది తప్పుపడుతున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సుప్రీం తీర్పు ఫై స్పందించారు. ఆర్టికల్ 370 (Article 370) రద్దుపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జమ్ము – కశ్మీర్‌ను భారతదేశంలో సంపూర్ణంగా విలీనం చేయాలని కలలుగన్న భారత్ ప్రజలందరికీ.. సుప్రీం తీర్పు మరో విజయమని ఆయన వ్యాఖ్యానించారు. దేశ ప్రజలందరూ సంతోషంగా వేడుకలు జరుపుకొనే మధుర క్షణాలు అంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేస్తూ చేసిన నిర్ణయాన్ని సుప్రీం కోర్టు ఏకగ్రీవంగా సమర్థిస్తూ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామనన్నారు. సుప్రీం తీర్పు ద్వారా ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగపరంగా చెల్లుబాటేనని ధృవీకరించిందని పవన్‌ కళ్యాణ్ వెల్లడించారు. ఈ నిర్ణయం దేశ సమగ్ర ఐక్యత, పురోగతికి ఒక ముఖ్యమైన పరిణామమని ఆయన చెప్పుకొచ్చారు. అతి పెద్ద లౌకిక దేశమైన భారత్ సాధించిన విజయమని పవన్‌ స్పష్టం చేశారు.

సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ (K Narayana) మాత్రం ఈ తీర్పు ఫై అభ్యంతరం వ్యక్తం చేసారు. రాజ్యాంగ వ్యవస్థను బద్దలు కొట్టే 370 ఆర్టికల్ ను రద్దు చేయడాన్ని సుప్రీంకోర్టు సమర్ధించడం ప్రమాదకర చర్య అని అన్నారు. సుప్రీం కోర్టు సమర్ధించడం అంటే బీజేపీ దుష్ట విధానాన్ని సమర్ధించడమే అవుతుందని ఆయన అన్నారు. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ వ్యతిరేక చర్య మాత్రమే గాక జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఇచ్చిన హామీల ఉల్లంఘన అని తెలిపారు. 370 ఆర్టికల్ రద్దు చేయడం లౌకిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడమే అని పేర్కొన్నారు.

Read Also : Ganji Chiranjeevi : గంజి చిరంజీవికి కీలక పదవి అప్పగించిన జగన్