Jharkhand Floor Test: జార్ఖండ్ తీర్పుపై ఉత్కంఠ.. అసెంబ్లీకి చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి

ఈ రోజు జార్ఖండ్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అరెస్టయిన జేఎంఎం నేత, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చంపై సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై విశ్వాస ఓటింగ్‌లో పాల్గొనేందుకు సోమవారం అసెంబ్లీకి చేరుకున్నారు.

Jharkhand Floor Test: దేశవ్యాప్తంగా జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం గురించే చర్చిస్తున్నారు. భూ కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ని ఈడీ అదుపులోకి తీసుకోవడంతో ప్రభుత్వం విమర్శలపాలైంది. కాగా ఈ రోజు జార్ఖండ్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అరెస్టయిన జేఎంఎం నేత, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చంపై సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై విశ్వాస ఓటింగ్‌లో పాల్గొనేందుకు సోమవారం అసెంబ్లీకి చేరుకున్నారు.

జార్ఖండ్ ముక్తి మోర్చా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ హేమంత్ సోరెన్‌ను ఫ్లోర్ టెస్ట్‌లో పాల్గొనేందుకు రాంచీలోని ప్రత్యేక కోర్టు అనుమతించింది. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జనవరి 31న అరెస్టు చేసింది. ఫిబ్రవరి 2న కోర్టు అతడిని ఐదు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది.

కొత్త ప్రభుత్వం కోరిన విశ్వాస ఓటింగ్‌లో పాల్గొనేందుకు అనుమతి కోరుతూ హేమంత్ సోరెన్ ప్రత్యేక మనీలాండరింగ్ చట్టం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.తాను అసెంబ్లీ సభ్యుడినని, ప్రత్యేక సభల్లో పాల్గొనే హక్కు తనకు ఉందని కోర్టుకు విన్నవించారు. చంపై సోరెన్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం సభలో మెజారిటీని నిరూపించుకోవడానికి బలపరీక్షను కోరింది. హేమంత్ సోరెన్ అరెస్టు తర్వాత ఫిబ్రవరి 2న జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు.

Also Read: Eggs: ప్రతిరోజు ఎన్ని కోడిగుడ్లు తీసుకోవాలి.. గుడ్లు తినడం వల్ల కలిగే లాభాలు ఇవే?