Uttar Pradesh : ఆర్మీ విమానం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో కుప్పకూలింది. సాంకేతిక కారణాలతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కు చెందిన మిగ్-29 ఫైటర్ జెట్ సోమవారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలెట్ సహా మరో వ్యక్తి ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. జెట్ నేలకూలుతుందని గ్రహించిన వారిద్దరూ అందులోంచి కిందకు దూకేశారు. ఆ వెంటనే జెట్ ల్లోపంట పొలా కుప్పకూలి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలంలో గుమిగూడారు.
అయితే విమానంలో పైలట్‌తో సహా ఇద్దరు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడం విశేషం. ఇది ఎయిర్‌ఫోర్సుకు చెందిన మిగ్-29 జెట్ విమానంగా గుర్తించారు. పంజాబ్ అదంపూర్ నుంచి ఆగ్రా వెళ్తుండగా ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న ఎయిర్‌ఫోర్స్ అధికారులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. సమీపంలోనే ఫైటర్ జెట్ బ్లాక్ బాక్స్ కూడా పడి ఉంది.
కాగా, విమానం పంజాబ్‌లోని అదంపూర్ నుంచి బయలుదేరి ప్రాక్టీస్ కోసం ఆగ్రా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విమానంలో ఏదైనా సాంకేతిక లోపం ఉందా? లేదా ప్రమాదానికి మరే దైనా కారణా అని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఆగ్రా కంటోన్మెంట్ నుంచి ఆర్మీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. మంటల కారణంగా విమానం పూర్తిగా కాలి బూడిదైంది. అనేక సందర్భాల్లో, MiG-29 విమానాలు భారతదేశానికి నమ్మదగనివిగా నిరూపించబడ్డాయి. ఈ యుద్ధ విమానాలను 1987లో అధికారికంగా భారత సైన్యంలోకి చేర్చారు. 2022 నాటికి దాదాపు 115 MiG-29 విమానాలు భారతదేశంలో సేవలు అందిస్తున్నాయి. అయితే.. వీటిలో చాలా ప్రమాదాలు కూడా జరిగాయి.
Read Also: Shah Rukh Khan : స్మోకింగ్ మానేయడానికి.. నేను రోల్ మోడలేం కాదు : షారుక్