Civilian Deaths In Poonch: జమ్మూలో ఆర్మీ అధికారులపై విచారణ

డిసెంబరు 21న పూంచ్‌లో ఉగ్రవాదులు జరిపిన ఆకస్మిక దాడిలో నలుగురు ఆర్మీ జవాన్లు హతమయ్యారు. భద్రతా దళాలే లక్ష్యంగా ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది. జవాన్లు ప్రయాణిస్తున్న రెండు ఆర్మీ వాహనాలపై ఈ దాడి జరిగింది

Published By: HashtagU Telugu Desk
Civilian Deaths

Civilian Deaths

Civilian Deaths In Poonch: డిసెంబరు 21న పూంచ్‌లో ఉగ్రవాదులు జరిపిన ఆకస్మిక దాడిలో నలుగురు ఆర్మీ జవాన్లు హతమయ్యారు. భద్రతా దళాలే లక్ష్యంగా ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది. జవాన్లు ప్రయాణిస్తున్న రెండు ఆర్మీ వాహనాలపై ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో మరో ముగ్గురు జవాన్లు కూడా గాయపడ్డారని సైనిక అధికారులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ముగ్గురు పౌరులను ఆర్మీ విచారణ కోసం తీసుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సమయంలో 27 నుంచి 42 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు పౌరులు డిసెంబర్ 22న చనిపోయారు. అయితే కస్టడీ టార్చర్ కారణంగా మరణించారని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో వారిపై విచారణకు రంగం సిద్ధమైంది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌లో భాగంగా పౌరుల మరణాలపై సమగ్ర విచారణకు ఆదేశించామని, ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా మృతులపై విచారణ జరుపుతున్నారు. కాగా దర్యాప్తుకి పూర్తి మద్దతు మరియు సహకారం అందించడానికి కట్టుబడి ఉన్నామని ఆర్మీ తెలిపింది.

Also Read: Tecno: అద్భుతమైన ఫీచర్స్ తో అదర గొడుతున్న టెక్నో సరికొత్త స్మార్ట్ ఫోన్.. ధర పూర్తి వివరాలివే?

  Last Updated: 24 Dec 2023, 04:22 PM IST