Four Soldiers Killed : జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో సోమవారం రాత్రి ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక ఆర్మీ అధికారి, ముగ్గురు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. వాస్తవానికి సోమవారం రాత్రి కాల్పులు జరిగిన తర్వాత వారి పరిస్థితి విషమించింది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ ఆర్మీ అధికారి, ముగ్గురు ఆర్మీ జవాన్లు మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
We’re now on WhatsApp. Click to Join
సోమవారం సాయంత్రం కాశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) దళాలు దోడా పట్టణానికి 55 కిలోమీటర్ల దూరంలోని దేశా ఫారెస్ట్ బెల్ట్‌లోని ధరి గోటే ఉరర్‌బాగి వద్ద కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈక్రమంలో ఉగ్రవాదుల కదలికలను భద్రతా బలగాలు గుర్తించాయి. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ మొదలైంది. ఉగ్రవాదులు సమీపంలోని దట్టమైన అడవుల్లో దాక్కుంటూ భద్రతా బలగాలపై ఫైరింగ్ చేశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు భద్రతా దళ సిబ్బందికి గాయాలు కాగా.. చికిత్స పొందుతూ నలుగురు(Four Soldiers Killed) చనిపోయారు.
Also Read :Usha Chilukuri Vance : అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి మన తెలుగింటి అల్లుడే !
ఈ దాడికి పాల్పడింది తామేనని పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ షాడో గ్రూప్ ‘కశ్మీర్ టైగర్స్’ ప్రకటించింది. జులై 9న కశ్మీర్‌లోని కతువాలో ఆర్మీ కాన్వాయ్‌పై జరిగిన దాడికి కూడా తామే బాధ్యులమని గతంలో ‘కాశ్మీర్ టైగర్స్’ ప్రకటించుకుంది. ఇక దోడా జిల్లాలోని అడవుల్లో ఉగ్రవాదుల కోసం ప్రస్తుతం భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఉగ్రవాదులను పట్టుకునే వరకు ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది.
జమ్మూ కశ్మీర్‌లో మూడు దశాబ్దాలకుపైగా మూసి ఉన్న అమ్మవారి ఆలయం ఇటీవలే తెరచుకుంది. అనంత్‌నాగ్‌లోని షాంగుస్ తాలూకాలోని ఉమా భగవతి ఆలయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సమక్షంలో గత ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1990లో కూల్చివేసిన ఉమా భగవతి అమ్మవారి ఆలయం పునరుద్ధరించినట్టు కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్ వెల్లడించారు. అభివృద్ధితో పాటు లోయలో శాంతి నెలకొల్పడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.