Current Bill : కరెంట్ బిల్లు ఫై గొడవ..విద్యుత్తు అధికారిని చంపిన వ్యక్తి

మీము కరెంట్ వాడకం కూడా ఎక్కువగా చేయం..అయినప్పటికీ కరెంట్ బిల్లు మాత్రం అధికంగా వస్తుందని విద్యుత్తు అధికారుల వద్ద మొరపెట్టుకున్నాడు

  • Written By:
  • Publish Date - April 26, 2024 / 10:25 AM IST

కరెంట్ బిల్లు (Current Bill) ఎందుకు ఎక్కువ వచ్చిందో చెప్పాలంటూ..విద్యుత్తు అధికారిని (Electricity Official) ప్రశ్నించాడు ఓ వ్యక్తి…దానికి సదరు మహిళా విద్యుత్తు అధికారి సరైన సమాధానం చెప్పకుండా అలాగే వస్తుందంటూ దురుసుగా మాట్లాడింది..దాంతో కోపంతో ఆమెను హతమార్చిన ఘటన మహారాష్ట్రలోని పూణె జిల్లా మోర్గావ్ లో చోటుచేసుకుంది. బుధువారం అభిజిత్ పోటే (33) తనకు ప్రతిసారి రూ.500 పైగా కరెంట్ బిల్లు రావడంతో పలుమార్లు కరెంట్ ఆఫీస్ కు వెళ్లి ఎందుకు ఇలా ఎక్కువ వస్తుందని..మీము కరెంట్ వాడకం కూడా ఎక్కువగా చేయం..అయినప్పటికీ కరెంట్ బిల్లు మాత్రం అధికంగా వస్తుందని విద్యుత్తు అధికారుల వద్ద మొరపెట్టుకున్నాడు. అయినప్పటికీ వారు మాత్రం సరైన సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నెల కూడా రూ.570 రావడం తో బిల్లు ను తీసుకొని మోర్గావ్ లోని మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కో లిమిటెడ్ కార్యాలయానికి వెళ్లాడు. గతంలోనే దీనిపై ఫిర్యాదు చేసిన అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా తన కరెంట్ బిల్లుపై స్పందించకపోవడంతో.. ఎంఎస్ఈడీసీఎల్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న రింకు తితే (26)పై కత్తితో దాడి చేశాడు. పదిరోజుల సెలవు తర్వాత ఆఫీస్ కు వచ్చిన రింకుపై కత్తితో దాడి చేయడంతో.. తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. పోలీసులు రింకు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపి.. అభిజిత్ పై కేసు నమోదు చేశారు. 302 సెక్షన్ తో పాటు.. ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అభిజిత్ ను అరెస్ట్ చేసారు.

Read Also : TTD Exchange Rs 2000 Notes: రూ.3.2 కోట్ల విలువైన రూ.2,000 నోట్లను మార్చిన‌ టీటీడీ